హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మొబైల్ యాపే.. డ్రైవింగ్ లైసెన్స్: ఎం-వాలెట్ వల్ల లాభాలెన్నో?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఈ గవర్నెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం దూసుకెళుతోంది. ఐటీ రంగంలో పలు కీలక విజయాలు సాధించిన ప్రభుత్వం బుధవారం సచివాలయంలో రవాణాశాఖ రూపొందించిన ఎం వాలెట్ మొబైల్ యాప్‌ను పంచాయతీరాజ్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.

గూగుల్ ప్లే స్టోర్ లో ఎం-వాలెట్ య ాప్ ను ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలోనే ప్రప్రథమంగా వాహనదారులకు ఉపయోగపడేలా మొబైల్ యాప్‌ను తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ రూపొందించడం అభినందనీయమని కేటీఆర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా చోటుచేసుకొంటున్న మార్పులను ఆర్టీఏ అందిపుచ్చుకుందని ప్రశంసించారు.

ఎం వాలెట్ యాప్‌ వల్ల ప్రయోజనాలేంటీ?

ఆర్టీఏ ఎం వాలెట్ యాప్‌తో ఒక్క క్లిక్‌తోనే వాహనానికి సంబంధించిన పత్రాలన్నీ చూసుకోవచ్చు. ఒక్కసారి ఈ యాప్‌లో నమోదు చేసుకుంటే చాలు.. వేరే ఇతర మొబైల్ నుంచి అయినా మన వాహనానికి సంబంధించిన వివరాల్ని చూడొచ్చు. వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు.. ఆ వాహనం ఎవరి పేరిట ఉన్నది..? నడిపే వ్యక్తి అసలు యజమానా? కాదా? అనే విషయం ఎంవాలెట్ యాప్‌లో తెలిసిపోతుంది.

అంతేకాదు ట్రాఫిక్ ఉల్లంఘించిన వ్యక్తి వాహన యజమాని కాకపోతే అతడి ఫోన్‌నంబర్‌కు సమాచారం అందుతుంది. ఎంవాలెట్ యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్‌ఫామ్‌ల్లో లభిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి.. ఆర్టీఏ ఎం వ్యాలెట్ మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

 మొబైల్ యాపే.. డ్రైవింగ్ లైసెన్స్: ఎం-వాలెట్ వల్ల లాభాలెన్నో?

మొబైల్ యాపే.. డ్రైవింగ్ లైసెన్స్: ఎం-వాలెట్ వల్ల లాభాలెన్నో?

ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యం నామమాత్రంగా ఉన్నప్పుడే.. పాలనా వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా విశ్వసిస్తారని పేర్కొన్నారు. ప్రతి పది కిమీ లేదా వంద కిమీ పోలీసులను ఏర్పాటు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువకు తీసుకువస్తే చాలు అని కేటీఆర్ తెలిపారు.

 మొబైల్ యాపే.. డ్రైవింగ్ లైసెన్స్: ఎం-వాలెట్ వల్ల లాభాలెన్నో?

మొబైల్ యాపే.. డ్రైవింగ్ లైసెన్స్: ఎం-వాలెట్ వల్ల లాభాలెన్నో?

పాలనా వ్యవస్థ మెరుగ్గా ఉన్నదన్న విషయాన్ని ప్రజలు కండ్లతో చూడనక్కరలేకుండా.. అనుభూతి చెందేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు. అమెరికాలో తాను నివసించిన కాలంలో కేవలం ఒకే ఒక్కసారి ప్రభుత్వ కార్యాలయం గడప తొక్కానని.. అది కూడా డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవడానికి వెళ్లినట్లు గుర్తుచేసుకున్నారు.

 మొబైల్ యాపే.. డ్రైవింగ్ లైసెన్స్: ఎం-వాలెట్ వల్ల లాభాలెన్నో?

మొబైల్ యాపే.. డ్రైవింగ్ లైసెన్స్: ఎం-వాలెట్ వల్ల లాభాలెన్నో?

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మన వద్ద ఆధునిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్నదని చెప్పడానికి రవాణా శాఖ రూపొందించిన మొబైల్ యాపే నిదర్శనమన్నారు.

 మొబైల్ యాపే.. డ్రైవింగ్ లైసెన్స్: ఎం-వాలెట్ వల్ల లాభాలెన్నో?

మొబైల్ యాపే.. డ్రైవింగ్ లైసెన్స్: ఎం-వాలెట్ వల్ల లాభాలెన్నో?

టెక్నాలజీని గణనీయంగా వాడుకోవడం ద్వారా హైదరాబాద్‌లో 14శాతం క్రైమ్ రేటు తగ్గిందని పేర్కొంటూ.. హైదరాబాద్ పోలీసుల పనితీరును ప్రశంసించారు.దేశీయ రవాణా రంగంలో ప్రప్రథమ మొబైల్ యాప్‌ను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆరంభించడం సంతోషంగా ఉందని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

 మొబైల్ యాపే.. డ్రైవింగ్ లైసెన్స్: ఎం-వాలెట్ వల్ల లాభాలెన్నో?

మొబైల్ యాపే.. డ్రైవింగ్ లైసెన్స్: ఎం-వాలెట్ వల్ల లాభాలెన్నో?

తమ శాఖ రూపొందించిన మొబైల్ యాప్ వల్ల దాదాపు 80 లక్షల మంది వాహనదారులకు.. 60 లక్షల మంది లైసెన్సుదారులకు ఉపయోగపడుతుందన్నారు. వాహనాల డాక్యుమెంట్లు పోగొట్టుకున్నా ఇక చింతించాల్సిన అవసరం లేదన్నారు.

 మొబైల్ యాపే.. డ్రైవింగ్ లైసెన్స్: ఎం-వాలెట్ వల్ల లాభాలెన్నో?

మొబైల్ యాపే.. డ్రైవింగ్ లైసెన్స్: ఎం-వాలెట్ వల్ల లాభాలెన్నో?

కార్యక్రమంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, రవాణా శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్‌శర్మ, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

English summary
IT Minister KTR Speech At RTA M Wallet App Launch Event at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X