India
  • search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవంత్ నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు, కీలక పత్రాలు సీజ్, ఆ రూ.20కోట్లు ఎక్కడివి?

|
Google Oneindia TeluguNews
రేవంత్‌రెడ్డి ఇంటిలో ముగిసిన ఐటి సోదాలు

హైదరాబాద్‌: ఆదాయానికి మించి ఆస్తులు కూడాబెట్టారన్న ఫిర్యాదులతో తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ గురువారం రాత్రి నుంచి చేపట్టిన సోదాలు శనివారం తెల్లవారుజామున ముగిశాయి.

48గంటలపాటు సోదాలు.. రేవంత్ హాజరుకావాలి..

48గంటలపాటు సోదాలు.. రేవంత్ హాజరుకావాలి..

గురువారం రాత్రి నుంచి శనివారం వేకువజామున 2.30 గంటల వరకు ఈ సోదాలు జరిపిన ఐటీ అధికారులు.. కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకుని తిరిగి వెళ్లారు. అక్టోబర్‌ 3న ఐటీ శాఖ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని రేవంత్‌రెడ్డికి సూచించారు.

రేవంత్‌పై ప్రశ్నల వర్షం, భార్యను బ్యాంక్‌కు తీసుకెళ్లిన అధికారులు: హాంకాంగ్‌లో ఖాతా, ఎవరీ మురళి?రేవంత్‌పై ప్రశ్నల వర్షం, భార్యను బ్యాంక్‌కు తీసుకెళ్లిన అధికారులు: హాంకాంగ్‌లో ఖాతా, ఎవరీ మురళి?

రేవంత్ తోపాటు సోదరుడు, బంధువుల ఇళ్లలోనూ..

రేవంత్ తోపాటు సోదరుడు, బంధువుల ఇళ్లలోనూ..

మొదటి రోజైన గురువారం రేవంత్‌ సోదరులు కృష్ణారెడ్డి, కొండల్‌రెడ్డి, బావమరిది జయప్రకాశ్‌రెడ్డిలతోపాటు ఆయన మిత్రులు సెబాస్టియన్‌, ఉదయసింహ ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. రేవంత్‌ బంధువుల స్థిరాస్తి వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఆదాయ వ్యయ వివరాలు సేకరించేందుకే అధికారులు తొలిరోజు ప్రాధాన్యమిచ్చారు.

లెక్కచూపని ఆస్తులు రూ. 20కోట్లు

లెక్కచూపని ఆస్తులు రూ. 20కోట్లు

శుక్రవారంనాడు కేవలం రేవంత్‌రెడ్డి ఇంట్లోనే సోదాలు చేశారు ఐటీ అధికారులు. ఎన్నికల సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్లు, ఆదాయపు పన్ను శాఖకు దాఖలు చేసిన అఫిడవిట్లు దగ్గర పెట్టుకుని మరీ సోదాలు చేశారు. ఈ సందర్భంగా లెక్క చూపని ఆస్తులు రూ.20 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇది రేవంత్‌ బావమరిది జయప్రకాశ్‌రెడ్డికి చెందిన శ్రీ సాయిమౌర్య ఎస్టేట్స్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి సంబంధించిన మొత్తంగా తేలింది. ఈ కంపెనీ 2011 తర్వాత ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం లేదు. ఈ కంపెనీ ఆదాయ, వ్యయాలను పరిశీలించగా లెక్క చూపించని ఆదాయం రూ.20 కోట్లు తేలింది. దీనికి సంబంధించిన 30% జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉంటే, శుక్రవారం రాత్రి రేవంత్ అభిమానులు భారీగా చేరుకోవడంతో ఆయన నివాసం వద్ద కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు.

రేవంత్ భార్యను తీసుకెళ్లి బ్యాంకు లాకర్లు ఓపెన్ చేయించారు..

రేవంత్ భార్యను తీసుకెళ్లి బ్యాంకు లాకర్లు ఓపెన్ చేయించారు..


కాగా, శుక్రవారం నాడే రేవంత్‌ భార్య గీత బ్యాంక్‌ లాకర్‌ను తెరిపించిన అధికారులు 560 గ్రాముల బంగారాన్ని, కొన్ని ఆస్తిపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన మామ పద్మారెడ్డి ఇంట్లోనూ 10 లక్షల నగదు లభ్యమైంది. రేవంత్‌ నివాసంలో నిన్న కొన్ని వజ్రాభరణాలు, బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బంగారు, వెండి ఆభరణాల విలువ అంచనా వేసేందుకు నిపుణులను తీసుకొచ్చారు. సోదాల సందర్భంగా అధికారులు రేవంత్‌రెడ్డి ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్లతోపాటు గురువారం స్వాధీనం చేసుకున్న కంప్యూటర్‌ హార్డ్‌డిస్కులను సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీకి చెందిన నిపుణులను పిలిచి అప్పగించారు. న్యాయస్థానం అనుమతితో వీటిని విశ్లేషించి అందులో ఉన్న సమాచారం వెలికితీసి నివేదిక సమర్పించనున్నారు.

విదేశాల నుంచి సొమ్ము ఎలా వచ్చింది.. వెళ్లింది.. ఓటుకు నోటు కేసులో..

విదేశాల నుంచి సొమ్ము ఎలా వచ్చింది.. వెళ్లింది.. ఓటుకు నోటు కేసులో..


రేవంత్‌ ఖాతాల్లోకి విదేశాల నుంచి సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది... ఆ సొమ్మును ఎక్కడికి మళ్లించారనే విషయాలపై ఐటీ అధికారులు లోతుగా విచారించారని సమాచారం. రేవంత్‌తో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహా, రేవంత్ సోదరుడు కొండల్‌రెడ్డి నివాసాల్లో అధికారులు సోదాలు జరిపారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి సెబాస్టియన్, ఉదయ్ సింహను అధికారులు ప్రశ్నించారు. ఇప్పటికే వారిద్దరికీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కాగా, ఐటీ సోదాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి శనివారం మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది.

English summary
The Income Tax department's searches at Telangana Pradesh Congress Committee working president Anumula Revanth Reddy's residence concluded on early Saturday morning at around 2:45 am.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X