వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు...మహర్షి చిత్రానికి సంబంధించి ఆరా

|
Google Oneindia TeluguNews

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా గురువారం విడుదల కానున్న నేపథ్యంలో అంతకంటే ఒక్క రోజు ముందే ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు కార్యాలయంపై ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. భారీ బడ్జెట్‌తో రూపొందించిన మహర్షి సినిమాకు సంబంధించిన బిజినెస్, బడ్జెట్‌పై ఆరా తీస్తున్నట్లు సమాచారం. సాగర్ సొసైటీలోని కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మించడం జరిగింది. ఈ సినిమాకు ఎవరెవరు ఖర్చు పెట్టారు.. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారు... ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారా లేదా అనే అంశాలపై ఐటీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఏంటీ గందరగోళం: టికెట్ ధర పెంచ లేదన్న ప్రభుత్వం... ధరల పెంపుపై మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహంఏంటీ గందరగోళం: టికెట్ ధర పెంచ లేదన్న ప్రభుత్వం... ధరల పెంపుపై మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం

ఇదిలా ఉంటే మహర్షి సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మించిన నేపథ్యంలో తెలంగాణలో అదనపు షోలు వేసుకునేందుకు అనుమతివ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని తాను కోరినట్లు దిల్ రాజు చెప్పారు. ప్రభుత్వం ఇందుకు అనుమతి కూడా ఇచ్చిందని దిల్ రాజు చెప్పారు. మరోవైపు టికెట్ ధరలు పెంచుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని దిల్ రాజు చెప్పారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీనిపై మరో వాదన వినిపించింది.

IT raids in star producer Dil Rajus office,just before the release of Maharshi

సినిమా థియేటర్లలో టికెట్ ధరల పెంపు అంశం ప్రభుత్వ నిర్ణయిస్తుందని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని చెప్పారు. ప్రభుత్వం ఎక్కడా సినిమా టికెట్ ధరలు పెంచమని చెప్పలేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అయినప్పటికీ 79 థియేటర్లలో సినిమా టికెట్ ధర పెంచినట్లు తమ దృష్టికి వచ్చినట్లు తలసాని చెప్పారు. కోర్టు సూచనలమేరకే థియేటర్లు టికెట్ల ధరలను తమకు తోచినంతగా పెంచేశాయని దీనిపై కోర్టులో పిటిషన్ వేస్తామని తలసాని తెలిపారు.

English summary
Just a day before the release of superstar Mahesh babu flick Maharshi... troubles started for Dil Raju who is one of the producers for this movie.IT department had raided Dil Raju's office in Sagar society and questioned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X