హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు

|
Google Oneindia TeluguNews

ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కంపెనీపై ఆదాయపన్ను శాఖ మంగళవారం దాడి నిర్వహించింది. హైదరాబాద్, ఖమ్మం‌లోని ఆయన ఇళ్లు, కార్యాలయాలతో పాటు జూబ్లీహిల్స్‌లోని కార్యాలయంలోను ఆదాయపన్ను అధికారులు తనిఖీలు చెపట్టారు.

కొండా సురేఖకు మద్దతు, ఎర్రబెల్లికి సెగ, తెరపైకి కడియం కావ్య: అసంతృప్తులు, రంగంలోకి కేటీఆర్కొండా సురేఖకు మద్దతు, ఎర్రబెల్లికి సెగ, తెరపైకి కడియం కావ్య: అసంతృప్తులు, రంగంలోకి కేటీఆర్

శ్రీనివాస్ రెడ్డికి చెందిన నిర్మాణ కంపెనీలు, ప్రాజెక్టుల్లో సోదాలు చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత తెలంగాణలోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెరాసలో చేరారు.

IT searches in Khammam MP Ponguleti Srinivas Reddy home and offices

హైదరాబాద్‌లో ఆరుచోట్ల, ఖమ్మంలో పన్నెండు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ సర్కిల్‌ సమీపంలోని పొంగులేటి నివాసంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సోదాలు ప్రారంభించారు. ఎంపీ ఇంటిలోకి ఎవరూ ప్రవేశించకుండా రెండు గేట్లను మూసివేశారు.

హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోని రాఘవ ఇన్‌ఫ్రా కార్యాలయంలో కూడా తనిఖీలు నిర్వహించారు. ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రేపు కూడా తనిఖీలు కొనసాగే అవకాశముంది.

English summary
IT searches in Khammam MP Ponguleti Srinivas Reddy's home and onffices in Hyderabad and Khammam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X