వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ఆమరణ దీక్ష డొల్ల దీక్ష...నిమ్స్ రిపోర్ట్స్ చూస్తే తెలుస్తుంది: ఉత్తమ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ 2009లో తెలంగాణ కోసం చేసిన దీక్ష దొంగ దీక్ష అని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆమరణ దీక్ష అంటూ డ్రామాలు ఆడారని ధ్వజమెత్తారు. నగర కాంగ్రెస్ సమావేశం తర్వాత ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఆరోజు పెద్ద డ్రామా చేశారని అన్నారు. తెలంగాణ పేరుతో ఆమరణ నిరాహార దీక్ష అంటూ డ్రామాలాడి సాధింకచింది ఏమీ లేదని ఒక్క గడ్డం మాత్రమే సాధించారని ఎద్దేవా చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిమ్స్ రిపోర్ట్స్ చూస్తే తన శరీరంకు కావాల్సినవన్నీ ఫ్లూయిడ్స్ రూపంలో వెళ్లాయని గుర్తుచేశారు. ఈ బూటకపు దీక్ష చేసి అదేదో తానే తెలంగాణ తెచ్చినట్లు కలరింగ్ ఇస్తున్నారని మండిపడ్డారు.

అభ‌ద్ర‌తా భావం ఆక్ర‌మించిన‌ప్పుడే అస‌హ‌నం క‌ట్టలు తెంచుకుంటుందిఅభ‌ద్ర‌తా భావం ఆక్ర‌మించిన‌ప్పుడే అస‌హ‌నం క‌ట్టలు తెంచుకుంటుంది

నిజామాబాద్‌లో కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ముందు అతను ఏమిటో తెలుసుకోవాలని సూచించారు. కేసీఆర్ నకిలీ పాస్‌పోర్ట్‌ల సృష్టించడంలో ఏజెంట్‌గా ఉన్నారని తద్వారా ఇక్కడి నుంచి మనుషులను దుబాయ్‌కు పంపేవారని పేర్కొన్నారు. ఆ సమయంలో తాను పైలట్‌గా దేశానికి సేవలందించేవారని గుర్తుచేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆనాడు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కేసీఆర్‌ను పోలీసులు అరెస్టు చేస్తే అప్పటి ఎంపీ ఎమ్ఎస్ఆర్ తనను కాపాడినట్లు గుర్తుచేశారు. మహాకూటమి అంటే కేసీఆర్‌కు చెమటలు పడుతున్నాయని ఆరోపించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్‌కు సిగ్గులేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.తను తన భార్య రాజకీయాల్లో ఉన్నట్లు తెలిపిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తమకు పిల్లలు లేరని తెలంగాణ ప్రజలే తమ పిల్లలుగా భావిస్తున్నట్లు వెల్లడించారు.

It was a fake fast by KCR during telangana agitation alleges TPCC Chief Uttam

బతుకమ్మ చీరెలపై టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి కూడా కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శించారు. బతుకమ్మ చీరెల పంపిణీకి కాంగ్రెస్ అడ్డుపడుతోందని చెబుతున్న కేసీఆర్‌కు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన్న విషయం తెలియదా అని నారాయణ రెడ్డి ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కేసీఆర్ చేసిన పదప్రయోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నారాయణ రెడ్డి తెలిపారు. అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నేతృత్వంంలో సమావేశమైంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను ఈ కమిటీ చర్చించింది.

English summary
Telangana Pradesh Congress Committee president N. Uttam Kumar Reddy on Friday claimed that the indefinite hunger strike taken up by caretaker Chief Minister K. Chandrasekhar Rao in 2009 during the statehood agitation was a drama.Speaking to mediapersons after a city Congress meeting at Gandhi Bhavan, Mr Reddy said, “Mr Rao created a drama in the name of an indefinite strike during 2009. All he achieved was a beard. The report of NIMS reveals that Mr Rao took all the fluids that are required. After these fake protests, he claims that he brought statehood.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X