వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు ఆఫీసులపై ఐటీ దాడులు

|
Google Oneindia TeluguNews

జూనియర్ ఎన్టీఆర్ మామ, వైసీపీ నేత అయిన నార్నే శ్రీనివాసరావు ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడి చేశారు. నార్నే శ్రీనివాస రావుకు చెందిన స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ యొక్క హైదరాబాద్ కార్యాలయంలో సోదాలు జరిపారు ఆదాయపు పన్ను శాఖాధికారులు. మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఎండి అయిన మేఘా కృష్ణారెడ్డి ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపిన కొద్ది రోజుల్లోనే ఈ దాడులు జరగటం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. కృష్ణారెడ్డి, నార్నే శ్రీనివాస రావు ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసిపి ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. అలాగే పలు వ్యాపార లావాదేవీలు జరుపుతున్నారు.

నార్నే శ్రీనివాస రావు నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి అత్యంత దగ్గర బంధువు . అయినప్పటికీ, అతను టిడిపి అధినేత చంద్రబాబుతో విభేదించి 2019 ఎన్నికలకు ముందు వైసిపిలో చేరాడు. ఇక నార్నే నందమూరి నట వారసుడైన జూనియర్ ఎన్టీఆర్ కు మే 2011 లో తన కుమార్తె లక్ష్మి ప్రణతిని ఇచ్చి వివాహం చేశారు . అయినప్పటికీ, టిడిపీ అంటేనే నార్నే మండిపడతాడు. చంద్రబాబు అంటే నార్నే అసలు ఇష్టపడరు. ఇక దీంతోనే ఆయన రాజకీయంగా వైసిపితో ప్రయాణం సాగిస్తున్నారు. ఇక రాజకీయాల విషయంలో తన నిర్ణయంతో తారక్‌కు ఎటువంటి సంబంధం లేదని గతంలోనే నార్నే పేర్కొన్నాడు.

ITraids on Junior NTR father in law ycp leader narne srinivas rao

అయితే బీజేపీ ఏపీలో టీడీపీ , వైసీపీకి అనుకూలంగా ఉన్న వ్యాపార వేత్తలను టార్గెట్ చేస్తున్న క్రమంలోనే ఈ దాడులు జరుగుతున్నట్టు అధికార వైసీపీ నాయకులు సైతం భావిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి ఐటి రైడ్స్ ఒక శక్తివంతమైన ఆయుధంగా మారింది. అందుకే కీలక రాజకీయ నాయకుల నోళ్లను ఐటీ, సీబీఐ, ఈడీ దర్యాప్తుల పేరుతో నొక్కేస్తున్నారు అని టాక్ వినిపిస్తుంది.

English summary
Income Tax Officials raided the properties owned by Narne Srinivasa Rao who happens to be the Father-In-Law of Jr NTR. Search operation was conducted at the Hyderabad office of Studio N News Channel which is owned by Narne.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X