వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలోనే అతి పెద్ద టేబుల్‌పై ఇవాంకా డిన్నర్, ఫలక్‌నుమాలో ఏర్పాట్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ డిన్నర్ కోసం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాట్లు జరగనున్నాయి. అయితే ప్రపంచంలోనే అతి పెద్దదైన డిన్నర్ టేబుల్‌పై ఇవాంకా ట్రంప్‌ డిన్నర్ చేయనున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ డిన్నర్ కోసం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాట్లు జరగనున్నాయి. అయితే ప్రపంచంలోనే అతి పెద్దదైన డిన్నర్ టేబుల్‌పై ఇవాంకా ట్రంప్‌ డిన్నర్ చేయనున్నారు. జీఈఎస్ 2017 సదస్సుకు హజరైన ప్రతినిధులకు ప్రధాన మంత్రి మోడీ ఆతిథ్యం ఇవ్వనున్నారు.

Recommended Video

Ivanka Trump hyderabad Visit : Bar and Restaurants to be closed

ఇవాంకా పర్యటన: హైదరాబాద్‌లో హై అలర్ట్, 3 రోజులు గోల్కొండకు నో ఎంట్రీ, అర్థరాత్రికల్లా బార్లు బంద్!ఇవాంకా పర్యటన: హైదరాబాద్‌లో హై అలర్ట్, 3 రోజులు గోల్కొండకు నో ఎంట్రీ, అర్థరాత్రికల్లా బార్లు బంద్!

ఇవాంకా ట్రంప్‌కు పోచంపల్లి చీరెలు, మోడీకి కుర్తా, ఫైజామా: కెసిఆర్ సర్కార్ గిఫ్ట్ ఇవాంకా ట్రంప్‌కు పోచంపల్లి చీరెలు, మోడీకి కుర్తా, ఫైజామా: కెసిఆర్ సర్కార్ గిఫ్ట్

జీఈఎస్ 2017 సమ్మిట్‌కు హజరయ్యేందుకుగాను నవంబర్ 28వ, తేదిన ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్‌కు వస్తున్నారు. అయితే ఇవాంకా ట్రంప్ రాక కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవాంకాకు షాక్: అందుకే బేగంపేటకు, మూడు మైన్ ప్రూప్ వాహనాలుఇవాంకాకు షాక్: అందుకే బేగంపేటకు, మూడు మైన్ ప్రూప్ వాహనాలు

జీఈఎస్ 2017 సమ్మిట్‌కు హజరయ్యే ఇవాంకా ట్రంప్‌తో పాటు ప్రపంచంలోని వివిద దేశాలకు చెందిన 1600 మంది ప్రతినిధుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు వారి భద్రత కోసం ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకొంటుంది.

ఇవాంకా టూర్: రంగంలోకి 'జేమ్స్‌బాండ్‌‌లు', మహిళా ఐపిఎస్ అధికారి రక్షణఇవాంకా టూర్: రంగంలోకి 'జేమ్స్‌బాండ్‌‌లు', మహిళా ఐపిఎస్ అధికారి రక్షణ

అతిపెద్ద డైనింగ్ టేబుల్‌పై ఇవాంకా భోజనం

అతిపెద్ద డైనింగ్ టేబుల్‌పై ఇవాంకా భోజనం

జీఈఎస్ 2017 సదస్సుకు ఇవాంకా ట్రంప్‌తో పాటు ప్రతినిధులకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో డిన్నర్ ఇవ్వనున్నారు. ఈ డిన్నర్ కోసం ఫలక్‌నుమా ప్యాలెస్‌ను ఎంపిక చేశారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద డైనింగ్ హాల్‌గా పేర్కొంటున్న ప్యాలెస్‌లోని ‘101 డైనింగ్ హాల్'లో ఈ విందు ఇవ్వనున్నారు.

డైనింగ్ హల్ ప్రత్యేకతలివే

డైనింగ్ హల్ ప్రత్యేకతలివే

ఫలక్‌నూమా ప్యాలెస్‌లోని 101 డైనింగ్ హాల్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద డైనింగ్ హాల్‌గా ప్రసిద్ది చెందింది. ఈ హాల్‌లో 108 అడుగల పొడవైన టేబుల్ ఉంది. ఒకేసారి 100 మంది అతిథులు భోజనం చేయవచ్చు. చెక్కతో చేసిన కళాకృతులు, స్పటిక కొవ్వొత్తులు, వినసొంపైన సంగీతం ఈ హాల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇవాంకాకు ఇవ్వనున్న ఈ విందులో భారత్‌కు చెందిన సంస్కృతి, ఆచారాలను ప్రదర్శించే అవకాశం ఉంది.

ముఖ్యులకే ఈ డైనింగ్ హల్‌పై చోటు

ముఖ్యులకే ఈ డైనింగ్ హల్‌పై చోటు

ఈ విందులో పాల్గొనే అత్యంత ముఖ్యమైన వ్యక్తులకు 101 డైనింగ్ హాల్లోని టేబుల్‌పై డిన్నర్ చేసే అవకాశం దక్కుతోంది. మిగిలినవారికి ప్యాలెస్‌లోని పచ్చిక బయళ్ళపై అవే వంటకాలతో విందు ఇవ్వనున్నారు. అంతేకాదు హలీం, హైద్రాబాద్ బిర్యానీ లాంటి స్పెషల్ వంటకాలను కూడ అతిథులకు రుచి చూపించనున్నారు.

అతిథులకు ఏర్పాట్లు

అతిథులకు ఏర్పాట్లు

జీఈఎస్ 2017 సదస్సుకు హజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకొంటుంది ప్రభుత్వం. ప్రభుత్వ పరంగా ప్రతినిధులకు బసతో పాటు వారు పర్యటించే ప్రాంతాల్లో రక్షణ చర్యలను పటిష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడ జీఈఎస్‌కు హజరయ్యే ప్రతినిధులకు గోల్కొండ కోటలో అతిథ్యం ఇవ్వనుంది. ఈ విందులో తెలంగాణ వంటకాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.

English summary
Prime Minister Narendra Modi will be playing host to Ivanka Trump at the dinner at Hyderabad’s Falaknuma Palace on November 28.The US-based businesswoman and daughter of US President Donald Trump will be introduced to Indian cuisine at the Nizam dining hall in Falaknuma Palace, which is touted as the world’s largest dining hall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X