• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మీకు తెలుసా?: హిల్లరీకి ఇవాంక మంచి ఫ్రెండ్..అంతేకాదు ప్రేమకు మారుపేరు

By Swetha Basvababu
|

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాల పట్టి ఇవాంక ట్రంప్ అంటే ప్రేమకు మారుపేరు. జీవితంలో ఏదైనా సాధించాలంటే గాఢంగా ప్రేమించాలి. దాని నుంచి పుట్టుకొచ్చేదే.. దీక్ష, తపన, సంకల్పం. ఇవాంకా తన వ్యాపారంతోపాటు సమాజాన్ని ప్రేమించారు. కన్న తండ్రిని ప్రేమించారు. అంతెందుకు? తను ప్రేమించిన కుష్నర్‌ కోసం అతడి మతాన్ని ప్రేమించారు. ఇవాంకా ట్రంప్‌... ఈజ్‌ ఎ లైఫ్‌ ఆఫ్‌ లవ్‌! జీవితాన్ని ఇంతగా ప్రేమించిన ఇవాంకా ట్రంప్‌నకు ఇక ఏ వంక పెట్టగలం?

ఆమె ఈ నెల 28వ తేదీన గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌లో పాల్గొనడానికి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఏడాదిన్నర క్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ - బిల్ క్లింటన్ కూతురు చెల్సీ.. ఇవాంకాకు చిన్ననాటి స్నేహితురాలు. అందుకే 2008లో హిల్లరీ డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం బరాక్‌ ఒబామాతో పోటీపడుతున్నపుడు హిల్లరీకి ఎన్నికల విరాళమిచ్చారు ఇవాంకా.

 ఇవాంక రచయిత్రి కూడా!

ఇవాంక రచయిత్రి కూడా!

కుటుంబ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన ఇవాంకా... ‘ట్రంప్‌ గ్రూపు' ఎగ్జిక్యూటివ్‌ వైస్‌-ప్రెసిడెంట్‌గా ఎదిగారు. సోదరులు డొనాల్డ్‌ జూనియర్, ఎరిక్‌ ట్రంప్‌లతో కలిసి ట్రంప్‌ హోటల్స్‌ను స్థాపించారు. వాషింగ్టన్‌లోని చారిత్రక ఓల్డ్‌ పోస్ట్‌ ఆఫీసును రూ.1,300 కోట్లతో లగ్జరీ హోటల్‌గా మలచడంలో, మయామీలోని డొరల్‌ గోల్ఫ్‌ రిసార్ట్‌ను 1,600 కోట్ల రూపాయలతో ఆధునీకరించడంలోనూ ఇవాంకా ముఖ్యభూమిక పోషించారు. ఇవాంకా రచయిత్రి కూడా. ఇప్పటిదాకా రెండు పుస్తకాలు రాశారు. ‘ది ట్రంప్‌ కార్డ్‌: ప్లేయింగ్‌ టు విన్‌ వర్క్‌ అండ్‌ లైఫ్‌'అనే పుస్తకం 2009లో ప్రచురితమైంది. రెండోవది ‘వుమెన్‌ హూ వర్క్‌: రీరైటింగ్‌ ది రూల్స్‌ ఫర్‌ సక్సెస్‌'. ఇది మే నెలలో ప్రచురితమైంది. దీంట్లో మహిళలు ఉద్యోగ - ఇంటి బాధ్యతల మధ్య సమతౌల్యం సాధించడం ఎలాగో సూచనలు చేశారు.

 కష్టకాలంలో తండ్రికి అండగా..

కష్టకాలంలో తండ్రికి అండగా..

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ నోటికి అదుపు ఉండదు. మహిళలను చులకన చేస్తూ ట్రంప్‌ మాట్లాడిన టేపులూ ప్రచారపర్వంలో బయటకు వచ్చాయి. ఆ సమయంలో ఇవాంకా ట్రంప్ తండ్రికి అండగా నిలిచారు. ఆయన్ను సమర్థించారు. తండ్రిపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టారు. డొనాల్డ్‌ ట్రంప్‌కు, చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన మోడల్‌ ఇవానాలకు రెండో సంతానం ఇవాంకా ట్రంప్‌ 1981 అక్టోబర్‌ 30వ తేదీన జన్మించారు. ఇవాంకాకు పదేళ్ల వయస్సులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోగా ఆమె తండ్రి వద్దే పెరిగింది. చదువును నిర్లక్ష్యం చేయనని తల్లిదండ్రులను ఒప్పించి మరీ 14 ఏళ్ల వయసులో మోడలింగ్‌లో అడుగుపెట్టింది. వారాంతాల్లో, సెలవుల్లో టామీ హిల్‌ఫిగర్, ససాన్‌ జీన్స్‌ బ్రాండ్లకు మోడల్‌గా చేసింది. 1997లో సెవంటీన్‌ మ్యాగజైన్‌ కవర్‌పేజీపై కనిపించింది. అదే ఏడాది మిస్‌ టీన్‌ అమెరికా పోటీకి వ్యాఖ్యాతగా వ్యవహరించింది.

 ఇలా తండ్రి స్పీడ్‌కు బ్రేకు

ఇలా తండ్రి స్పీడ్‌కు బ్రేకు

ఉమ్మడి మిత్రులైన కొద్దిమంది ద్వారా ఇవాంకా 2005లో రియల్టర్‌ జేర్డ్‌ కుష్నర్‌ను తొలిసారి కలుసుకున్నారు. మూడేళ్లు డేటింగ్‌ చేశాక సంప్రదాయ యూదులైన కుష్నర్‌ తల్లిదండ్రుల అభ్యంతరాలతో వీరు విడిపోయారు. ఇవాంకా యూదు మతం స్వీకరించి మరీ 2009లో కుష్నర్‌ను వివాహమాడారు. డొనాల్డ్‌ ట్రంప్‌ తన కూతురు నిర్ణయానికి మన:స్ఫూర్తిగా పూర్తి మద్దతు ఇచ్చారు. ఇవాంకా వ్యవహారశైలి తండ్రి డొనాల్డ్ ట్రంప్‌నకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది . డొనాల్ట్‌ ట్రంప్‌ది దుందుడుకు స్వభావం. వ్యతిరేకులు, విమర్శకులపై ట్వీటర్‌లో తీవ్రంగా విరుచుకుపడతారు. ఇవాంకా మితభాషి. కలుపుగోలుగా ఉంటారు. తన అభిప్రాయాన్ని చాలా మృదువుగా సూటిగా, స్పష్టంగా చెబుతారు. మధ్యలో అడ్డుకోకుండా ఎదుటివారు చెప్పేది సాంతం వింటారు. మహిళా సాధికారత, సమాన వేతనం... తదితర అంశాలను ఇవాంకా ప్రచారంలో విరివిగా ప్రస్తావించడం... మహిళా ఓటర్లలో డొనాల్డ్‌ ట్రంప్‌ పట్ల సానుకూలత ఏర్పడడానికి కారణమైందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు ట్రంప్‌లో దూకుడు, మాటల్లో కరుకుదనం కనిపించక పోవడం వెనుక ఇవాంకా పాత్ర ఉంది.

 తొలి రెండు నెలలు అనధికారిక సలహాదారుగా...

తొలి రెండు నెలలు అనధికారిక సలహాదారుగా...

ఈ ఏడాది డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఇవాంక మొదటి రెండు నెలలు అనధికారికంగా తండ్రికి సలహాదారుగా ఉన్నారు. తగిన నిర్ణయాలు తీసుకోగలదని, అభిప్రాయాలను వెల్లడించడంలో నిర్మొహమాటంగా ఉంటారని ఇవాంక ట్రంప్‌కు పేరు. దాంతో డొనాల్ట్‌ ట్రంప్‌ మార్చి 29వ తేదీన ఆమెను తన సలహాదారుగా నియమించుకున్నారు. జీతం లేకుండా అమెరికా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేయడానికి ఇవాంక ముందుకు వచ్చారు. నిబంధనల ప్రకారం తన ఆస్తులను ప్రకటించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Inspiration for Love US president daughter Ivana Trump. She has straight forward and speaking openly. In critical conditions she has supported for her father Donald Trump. First 2 or 3 months she has worked un officially adviser for US president. After that US President Donald Trump appointed her adviser.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more