హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీరూ రండి!: కేటీఆర్‌కు ఇవాంకా ట్రంప్ ఫిదా, 'ఇవాంకా'పై మంత్రి చమత్కారం

|
Google Oneindia TeluguNews

Recommended Video

IT means Ivanka Trump says KTR | Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వ కుంట్ల తారక రామారావు వాక్చాతుర్యానికి అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ముగ్ధురాలయ్యారు. ఆయనను అమెరికాకు ఆహ్వానించారు. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్ అనంతరం కేటీఆర్ అమెరికాలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి.

బుధవారం గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్ రెండో రోజు ఇవాంకా ట్రంప్, కేటీఆర్, చందాకొచ్చార్ తదితరులు వేదికను పంచుకున్న విషయం తెలిసిందే. మహిళా సాధికారతపై వీరు చర్చించారు. దీనికి కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సమయంలో ఇవాంకా, కేటీఆర్‌ల మధ్య ఆసక్తికర చర్చ సాగింది.

మోడీ ఎందుకు పిలిచారో తెలియదు కానీ, దటీజ్ కేటీఆర్: మెగా ఫ్యామిలీ హీరోమోడీ ఎందుకు పిలిచారో తెలియదు కానీ, దటీజ్ కేటీఆర్: మెగా ఫ్యామిలీ హీరో

సరదా చేసిన మంత్రి

సరదా చేసిన మంత్రి

తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖా మంత్రి కేటీఆర్ బుధవారం జీఈఎస్ సదస్సులో కొంత సరదా చేశారు. రెండో రోజు జీఈఎస్ సదస్సులో భాగంగా ఇవాళ ప్లీనరీ జరిగింది. దానికి మంత్రి కేటీఆర్ మాడరేటర్‌గా వ్యవహరించారు.

వీరు పాల్గొన్నారు

వీరు పాల్గొన్నారు

ఈ ప్లీనరలో ప్యానలిస్టులుగా ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్, ఇవాంకా ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ, డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్‌లు ఉన్నారు.

 ఇవాంకాను పరిచయం చేసే సమయంలో కేటీఆర్ చమత్కారం

ఇవాంకాను పరిచయం చేసే సమయంలో కేటీఆర్ చమత్కారం

మొదట ఐసీఐసీఐ సీఈవో చందా కొచ్చార్‌ను మంత్రి కేటీఆర్ వేదిక మీదకు ఆహ్వానించారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్‌ను కూడా మంత్రి ఆహ్వానించారు. అయితే ఇవాంకాను పరిచయం చేసే సమయంలో మంత్రి కేటీఆర్ కొంత చమత్కారాన్ని ప్రదర్శించారు.

ఐటీ అంటే ఇవాంకా ట్రంప్

ఐటీ అంటే ఇవాంకా ట్రంప్

తాను రాష్ట్రానికి ఐటీ మంత్రిని అని, కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ఐటీ నామస్మరణ జరుగుతున్నదని, ఐటీ అంటే ఇవాంకా ట్రంప్ అని మంత్రి కేటీఆర్ నవ్వులు పూయించారు. మహిళా పారిశ్రామికవేత్తల్లో నైపుణ్యాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఈ ప్లీనరీని నిర్వహిస్తున్నారు.

కేటీఆర్

కేటీఆర్

కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ.. దక్షిణ ఆసియాలోనే తొలిసారి హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు జరగడం సంతోషంగా ఉందని చెప్పారు. అరుదుగా వచ్చిన ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల వివరణకు సరైన వేదిక ఇది అన్నారు. ఈ రోజు మనకు ఈ అవకాశం రావడానికి ముఖ్య కారణం టీ హబ్ అన్నారు. భవిష్యత్‌లో పారిశ్రామిక విధానంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. అమెరికా రావాలని ఇవాంక ట్రంప్ ఆహ్వానించిందని చెప్పిన కేటీఆర్.. త్వరలోనే అమెరికా పర్యటనకు వెళ్తానని మంత్రి తెలిపారు.

English summary
America president Donald Trump daughter Ivanka Trump invited Telangana IT Minister KTR to America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X