హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చివరి నిమిషంలో ఇవాంకా బసచేసే హోటల్ మార్పు: మహిళా ప్రాధాన్యత సదస్సు

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా ఆమె ట్రైడెంట్ హోటల్ చేరుకున్నారు. చివరి నిమిషంలో ఇవాంకా బస చేసే హోటల్ మారింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా ఆమె ట్రైడెంట్ హోటల్ చేరుకున్నారు. చివరి నిమిషంలో ఇవాంకా బస చేసే హోటల్ మారింది.

 ఇవాంకా ట్రంప్

ఇవాంకా ట్రంప్

ఇవాంకా ట్రంప్ మంగళవారం తెల్ల‌వారుజామున మూడు గంటల సమయంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు తెలంగాణ మంత్రులు, అమెరికా రాయబారి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

 తొలుత వెస్టిన్ హోటల్ అనుకున్నారు కానీ

తొలుత వెస్టిన్ హోటల్ అనుకున్నారు కానీ

అక్కడి నుంచి ఆమె తొలుత చెప్పిన ప్రకారం వెస్టిన్ హోటల్‌కు వెళ్లాలి. కానీ విమానాశ్ర‌యం నుంచి ప్ర‌త్యేక వాహ‌నంలో మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోట‌ల్‌కు చేరుకున్నారు. భద్రతా కారణాలతో చివరి నిమిషంలో హోటల్ మార్చారని తెలుస్తోంది.

 ఇవాంకా రాక కోసం నగరం ముస్తాబుకు రూ.43 కోట్లు

ఇవాంకా రాక కోసం నగరం ముస్తాబుకు రూ.43 కోట్లు

కాగా, ఇవాంకా రాక నేపథ్యంలో నగరం ముస్తాబుకు రూ.43 కోట్ల వరకు ఖర్చయిందని తెలుస్తోంది. ఆమె వచ్చిపోయే దారిలో గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. అలాగే, ఆమె వెళ్లే దారిలో రోడ్లను సుందరంగా తయారు చేశారు.

 మహిళా ప్రాధాన్య సదస్సు

మహిళా ప్రాధాన్య సదస్సు

కాగా, ఈ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సదస్సులో మహిళలకు అధిక ప్రాధాన్యం. దాదాపు చాలా దేశాలు కేవలం మహిళలనే ఈ సదస్సుకు పంపించాయి. 170 దేశాల నుంచి 1500 ప్రతినిధులు పాల్గొంటారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులు, కార్పోరేట్ దిగ్గజాలు ఈ సమ్మిట్‌లో పాల్గొంటారు.

English summary
Ivanka reached Hyderabad at 3AM today. She is in trident hotel instead of westen hotel due to security reasons. She come out of the hotel and will reach HICC to attend GES. At 3.30 meets sushma swaraj.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X