హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ బిర్యానీని మరిపిస్తారేమో: వేదికపై కేటీఆర్, ఇవాంకా ఉద్వేగం

|
Google Oneindia TeluguNews

Recommended Video

GES 2017: Ivanka Trump Says,Modi's Rise From Tea Seller Is Exemplary

హైదరాబాద్: మూడు రోజుల పాటు హెచ్ఐసిసిలో జరగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్‌లో రెండో రోజైన బుధవారం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా వేదిక పంచుకున్నారు. మంగళవారం జీఈఎస్ సదస్సును ప్రారంభించిన విషయం తెలిసిందే.

అందరినీ పలకరిస్తూ ఉత్సాహంగా ఇవాంకా: హోటల్లో ఇలా, ఇవాంకా కోసం సిటీలో రోడ్డెక్కారు!అందరినీ పలకరిస్తూ ఉత్సాహంగా ఇవాంకా: హోటల్లో ఇలా, ఇవాంకా కోసం సిటీలో రోడ్డెక్కారు!

ఈ సందర్భంగా ఇవాంకా ట్రంప్ అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడారు. ఆమె తెలంగాణ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో తన స్పందన తెలిపరు. ప్రధాని మోడీని కలవడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఇవాంకా తెలిపారు. జీఈఎస్ నిర్వహణలో పాలుపంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

చదవండి: తెలుగు రాష్ట్రాల్లో మొదటిది: హైదరాబాద్ మెట్రో కోసం మెగా ఫ్యామిలీ హీరో వెయిటింగ్

 హైదరాబాదులో ఉన్నందుకు ఉద్వేగం

హైదరాబాదులో ఉన్నందుకు ఉద్వేగం

హైదరాబాదులో తనకు సాదర స్వాగతం లభించిందని, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు అని ఇవాంకా పేర్కొన్నారు. హైదరాబాదులో ఉన్నందుకు తాను ఉద్వేగానికి గురయ్యానని చెప్పారు. ఇవాంకా ట్రంప్‌తో అద్భుతమైన సమావేశం జరిగిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఆయన మంగళవారం రాత్రి ట్వీట్ చేశారు.

ఓ పండుగలా జరుపుకునేందుకు వచ్చాం

ఓ పండుగలా జరుపుకునేందుకు వచ్చాం

అంతకుముందు సదస్సులో ఇవాంకా చాలాసేపు మాట్లాడారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మన ఆర్థిక వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని, సమాజాలను మెరుగుపరుస్తున్నారని, భారత్‌, అమెరికా, ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ఈ ముఖ్య పరిణామాన్ని ఓ పండుగలా జరపుకోవడానికి మనం ఇక్కడికి వచ్చామని చెప్పారు.

 సదస్సులో మోడీపై ఇవాంకా ప్రశంసలు

సదస్సులో మోడీపై ఇవాంకా ప్రశంసలు

ప్రధాని నరేంద్ర మోడీపై ఇవాంకా ప్రశంసలు జల్లు కురిపించారు. మోడీ ఆధ్వర్యంలో భారత్‌ పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, టీ అమ్మే స్థాయి నుంచి ప్రధానిగా ఎదిగిన మీ ప్రస్థానం భారతీయ నిపుణులకు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. మహిళా సాధికారిత లేకుండా అభివృద్ధి సాధ్యంకాదన్న మోడీకి ధన్యవాదాలు అని, చాలా దేశాల్లో మహిళలు సామాజిక అవరోధాలను ఎదుర్కొంటున్నారని, రేయాన్‌, లక్ష్మి వంటి యువ వ్యాపారవేత్తలు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.

 హైదరాబాద్ బిర్యానీని మరిపింప చేస్తారేమో

హైదరాబాద్ బిర్యానీని మరిపింప చేస్తారేమో

అద్భుతమైన భారత దేశంలోకి తమను స్వాగతించినందుకు గవర్నర్‌ నరసింహన్‌కు, భారత ప్రజాప్రతినిధులందరికీ తన ధన్యవాదాలు అని, పరివర్తనాత్మక పరిజ్ఞానంతో కొత్త పుంతలు తొక్కుతున్న ఈ పురాతన నగరికి రావడం అద్భుతమని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భాగ్యనగర బిర్యానీని కూడా మీ టెక్‌ సంస్థల మరపింపచేస్తాయేమోనని ఇవాంకా చలోక్తి విసిరారు.

 సత్య నాదేళ్ల వంటి వారు ఇక్కడే చదివారు

సత్య నాదేళ్ల వంటి వారు ఇక్కడే చదివారు

మైక్రోసాఫ్ట్‌కు చెందిన సత్య నాదెళ్ల వంటి సీఈవోలు ఈ నగరంలోనే పాఠశాల విద్యను అభ్యసించారని, ఇక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే టి హబ్‌ కొత్త కేంద్రం వచ్చే ఏడాది ప్రారంభం కాబోతోందన్నారు. పనిలో తనను తాను రుజువు చేసుకోవడానికి పురుషుల కన్నా మహిళలే ఎక్కువ కష్టపడుతున్నారని, పురుషాధిక్య ప్రపంచంలో ఒక మాజీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా, యజమానిగా, కార్యనిర్వాహక అధికారిగా నేను ప్రత్యక్షంగా చూశానని ఇవాంకా చెప్పారు.

 హైదరాబాద్ బిర్యానీ రుచిచూడండి

హైదరాబాద్ బిర్యానీ రుచిచూడండి

అంతకుముందు సదస్సులో ప్రారంభోత్సవం చేసిన కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ఆతిథ్యాన్న, హైదరాబాద్ బిర్యానీని రుచి చూడాలని అతిథులందరికీ చెప్పారు. దీంతో సభలో విశేష స్పందన లభించింది.

చదవండి: ఇవాంకా హైదరాబాద్ పర్యటనపై మరిన్ని కథనాలు

English summary
America President Donald Trump's daughter Ivanka Trump share dais with Telangana IT Minister KTR at GES on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X