వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోల్కోండ కోటను చూసి థ్రిల్లయ్యా: ఇవాంకా ట్రంప్ ట్వీట్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ జీఈఎస్ 2017 సమ్మిట్‌లో తన అనుభవాలను ట్వీట్ చేశారు. ముఖ్యంగా హైద్రాబాద్‌లో గోల్కొండ కోటను సందర్శించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. గోల్కోండ కోటను సందర్శించడమే తన పర్యటన ముగింపుకు పరిపూర్ణంగా నిలిచిందని ఆమె అభిప్రాయపడ్డారు.

Recommended Video

Ivanka Trump at Golkonda Fort | Oneindia Telugu

షాక్: ఇవాంకా హైద్రాబాద్ డ్రెస్ ఖర్చులతో కారు కొనొచ్చుషాక్: ఇవాంకా హైద్రాబాద్ డ్రెస్ ఖర్చులతో కారు కొనొచ్చు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహదారుడిగా వ్యవహరిస్తున్న ఇవాంకా ట్రంప్ జీఈఎస్ 2017 సదస్సుకు అమెరికా ప్రతినిధులకు సారధ్యం వహించారు. జీఈఎస్ 2017 సదస్సు ప్రధానంగా మహిళలపై ఫోకస్ చేసింది.

జీఈఎస్ 2017: మోడీ పక్కా ప్లాన్, ఇవాంకా ట్రంప్ రాకకు కారణమిదే!జీఈఎస్ 2017: మోడీ పక్కా ప్లాన్, ఇవాంకా ట్రంప్ రాకకు కారణమిదే!

దక్షిణాసియాలో జరుగుతున్న తొలి సదస్సుగా హైద్రాబాద్‌ సదస్సు రికార్డు సృష్టించింది. అయితే ఈ సదస్సుకు 1600 మంది ప్రతినిధులు హజరైతే వారిలో సగం మంది మహిళలే ఉన్నారు.

జీఈఎస్2017: ఇవాంకా నోట మన రాజ్‌లక్ష్మి పేరు, ఎవరీమె?జీఈఎస్2017: ఇవాంకా నోట మన రాజ్‌లక్ష్మి పేరు, ఎవరీమె?

<strong></strong>ఇవాంకా ట్రంప్‌కు టిఆర్ఎస్ టిక్కెట్టు: రాత్రికి రాత్రే రోడ్లు,రాజశేఖర్ వీడియో వైరల్ఇవాంకా ట్రంప్‌కు టిఆర్ఎస్ టిక్కెట్టు: రాత్రికి రాత్రే రోడ్లు,రాజశేఖర్ వీడియో వైరల్

హైద్రాబాద్ పర్యటనపై ఇవాంకా ట్వీట్

రెండు రోజుల పర్యటనను ముగించుకొని ఇవాంకా ట్రంప్ అమెరికాకు బుదవారం రాత్రి తిరిగి వెళ్ళారు. అమెరికాకు తిరిగి వెళ్ళిన తర్వాత ఇవాంకా ట్రంప్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. జీఈఎస్ 2017 సమ్మిట్ గురించి ఆమె తన ట్వీట్‌లో ప్రస్తావించారు.హైదరాబాద్‌ను నుంచి వచ్చే ముందు గోల్కొండ కోటకు వెళ్లాను. కొంతమంది అమెరికా ప్రతినిధులతో కలిసి కోటలో పర్యటించా. హైదరాబాద్ పర్యటనకు పరిపూర్ణమైన ముగింపు ఇదేనని గోల్కొండ కోటను చూశాక అనిపించిందని ఆమె తన ట్వీట్‌లో ప్రస్తావించారు.

 గోల్కొండ కోట చరిత్రపై ఆసక్తి

గోల్కొండ కోట చరిత్రపై ఆసక్తి

గోల్కొండ కోటను చూసి ఇవాంకా చాలా థ్రిల్‌కు ఫీలయ్యారని ఇవాంకా ట్రంప్‌కు కోట చరిత్రను వివరించిన గైడ్‌లు చెప్పారు. కోట గురించిన వివరాలను ఇవాంకా ట్రంప్ అడిగి తెలుసుకున్నారు. కోటలో ఆయుధగారం, రాణీమహల్‌ ప్రాంగణం, అక్కన్న, మాదన్న కార్యాలయాలను ఆమె సందర్శించారు.

 మా దేశంలో లేవు

మా దేశంలో లేవు

శతాబ్దాల క్రితం కోటలో వెల్లివిరిసిన రాజవైభవాన్ని వివరిస్తుంటే అమితాసక్తితో విన్నారు.. అలసటన్నది లేకుండా నడుచుకుంటూనే అక్కడ వివిధ ప్రదేశాలను చూస్తూ దాదాపు యాభై నిమిషాలు గడిపారు. కాగా గోల్కొండ లాంటి పురాతన కట్టడాలు తమ దేశంలో లేవని, ఇలాంటి చారిత్రక కోటలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఇవాంకా అన్నారు.

 చార్మినార్‌ పర్యటిస్తే

చార్మినార్‌ పర్యటిస్తే

హైద్రాబాద్ పాత నగరంలో ఉన్న చార్మినార్‌ను ఇవాంకా ట్రంప్ సందర్శించేలా ప్లాన్ చేశారు. కానీ, భద్రతా కారణాలరీత్యా అమెరికా అధికారులు అనుమతించలేదు. పాతబస్తీలో చార్మినార్ సందర్శనతో పాటు లాడ్ బజార్లో గాజుల దుకాణాలను సందర్శించాల్సి ఉండేది. కానీ, భద్రతా కారణాల రీత్యా ఈ పర్యటనను రద్దు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి.

English summary
Ivanka trump very happy on her Hyderabad tour. she tweeted about Golconda tour and hyderabad visit experience .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X