హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇవాంకా భోజనం: సెక్యూరిటీ రుచి చూశాకే, స్పెషల్ కిచెన్, మెడికల్ టీమ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కోసం తెలంగాణ ప్రభుత్వం హైద్రాబాద్ బిర్యానీని ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. ఇవాంకాతో పాటు జీఈఎస్ సదస్సుకు వచ్చే ప్రతినిధులకు తెలంగాణ వంటకాలను రుచి చూపేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది.

ప్రపంచంలోనే అతి పెద్ద టేబుల్‌పై ఇవాంకా డిన్నర్, ఫలక్‌నుమాలో ఏర్పాట్లుప్రపంచంలోనే అతి పెద్ద టేబుల్‌పై ఇవాంకా డిన్నర్, ఫలక్‌నుమాలో ఏర్పాట్లు

నవంబర్ 28వ, తేదిన హైద్రాబాద్‌లో జరిగే జీఈఎస్ సదస్సులో ఇవాంకా ట్రంప్ పాల్గొంటారు. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1600 ప్రతినిధులు పాల్గొంటారు. అయితే ఈ ప్రతినిధులందరికీ ప్రధానమంత్రి మోడీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా విందులను ఏర్పాటు చేసింది

ఇవాంకా ట్రంప్‌కు పోచంపల్లి చీరెలు, మోడీకి కుర్తా, ఫైజామా: కెసిఆర్ సర్కార్ గిఫ్ట్ఇవాంకా ట్రంప్‌కు పోచంపల్లి చీరెలు, మోడీకి కుర్తా, ఫైజామా: కెసిఆర్ సర్కార్ గిఫ్ట్

జీఈఎస్ సదస్సు ప్రారంభమైన తర్వాత అదే రోజు రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మోడీ జీఈఎస్ సదస్సులో పాల్గొనే ప్రతినిధులకు విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు ప్రపంచంలోనే అతి పెద్ద డైనింగ్‌ టేబుల్‌ను వినియోగించనున్నారు.

ఇవాంకాకు షాక్: అందుకే బేగంపేటకు, మూడు మైన్ ప్రూప్ వాహనాలుఇవాంకాకు షాక్: అందుకే బేగంపేటకు, మూడు మైన్ ప్రూప్ వాహనాలు

ఇవాంకా కోసం స్పెషల్ మెడికల్ టీమ్

ఇవాంకా కోసం స్పెషల్ మెడికల్ టీమ్

జీఈఎస్ సదస్సుకు హజరౌతున్న ఇవాంకా ట్రంప్ కోసం అమెరికాకు చెందిన ప్రత్యేక వైద్య బృందం కూడా వస్తోంది. ఇవాంకాకు ఏదైనా అనారోగ్య సమస్య, అత్యవసర పరిస్థితి తలెత్తితే.. వెంటనే తగిన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సదస్సు వేదిక వద్ద ప్రత్యేక క్లినిక్‌ ఏర్పాటు చేసి.. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులతో కూడిన మూడు బృందాలను అందుబాటులో ఉంచనుంది. అందులో కార్డియాలజిస్ట్, జనరల్‌ ఫిజీషియన్, అనెస్థీషియన్‌ సహా నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది ఉంటారు.

ఇవాంకాకు స్పెషల్ కిచెన్

ఇవాంకాకు స్పెషల్ కిచెన్

ఇవాంకా ట్రంప్ కోసం అమెరికా నుండి ప్రత్యేక వంటశాల వెంట రానుంది. ఇవాంకా వెంటనే ఆమెకు వంట చేసేందుకు ప్రత్యేక చెఫ్‌లు వంట సామాగ్రి కూడ తీసుకువస్తారు. ఆమెకు ఎప్పుడు ఏం వండి వండించాలన్నా ఈ కిచెన్‌లో తయారు చేస్తారు. ఇవాంకా ప్రయాణం చేసే విమానంలోనే ఈ సిబ్బంది హైద్రాబాద్‌కు వస్తారు.

భద్రత అధికారులు రుచి చూశాకే

భద్రత అధికారులు రుచి చూశాకే

ఇవాంకా ట్రంప్ తినే ఆహరపదార్ధాలను ఆమె భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తారు. ఇవాంకా కోసం ఏర్పాటు చేసే విందులో ఏ పదార్ధాలను ఉపయోగిస్తారు, ఆ పదార్ధాలను ఎక్కడి నుండి తీసుకువస్తారు.వంటల్లో ఉపయోగించే పదార్థాల్లో ఏమైనా కలుషితాలు ఉన్నాయా అనే విషయాలను కూడ పరిశీలిస్తారు.ఈ ఆహరపదార్ధాలను తొలుత ఆమె భద్రత అధికారులు రుచి చూస్తారు. అంతేకాదు వాటిని ల్యాబ్‌కు పంపుతారు. ల్యాబ్‌ నుండి నివేదిక వచ్చిన తర్వాతే ఇవాంకా ట్రంప్‌కు ఆ ఆహర పదార్ధాలను వడ్డిస్తారు.

మూడు పోరెన్సిక్ టీమ్‌లు

మూడు పోరెన్సిక్ టీమ్‌లు

ఇవాంకా ట్రంప్ భోజనం తయారీ కోసం ఉపయోగించే ఆహరపదార్ధాలను పరీక్షించేందుకుగాను మూడు ఫోరెన్సిక్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.ఒక్కోక్క టీమ్‌లో ఐదుగురు సభ్యులుంటారు. ఈ టీమ్‌లు ఇవాంకా బస చేసే ప్రాంతాల్లో కిచెన్‌లలో ఉపయోగించే ఆహరపదార్ధాలను చెక్ చేస్తారు.ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఇవాంకాకు ఇచ్చే విందుతో పాటు, ఇవాంకా బస చేసే మాదాపూర్ హోటల్‌లో ఈ ఆహరపదార్ధాలను పరిశీలిస్తారు.ఈ టీమ్‌లతో పాటు అమెరికన్ టీమ్‌లు కూడ ఈ ఆహరపదార్ధాలను పరిశీలిస్తాయి.

ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్ ఎస్సీ సింగ్

ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్ ఎస్సీ సింగ్

ఫలక్‌నుమా ప్యాలెస్‌, గోల్కొండ కోటల్లో జరిగే విందులో వడ్డించనున్న ఆహార పదార్థాల జాబితాను డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. తొలి ప్రాధాన్యం హైదరాబాద్‌ బిర్యానీకే ఇవ్వాలనీ, అందులోనే పలు రకాలు చేయించాలని సూచించారు. ఇద్దరు ఉన్నతాధికారులు శనివారం మెట్రో రైలు ప్రారంభోత్సవంతో పాటు జీఈఎస్‌ వేదిక భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

బిర్యానీతో ఫిదా అవ్వాల్సిందే

బిర్యానీతో ఫిదా అవ్వాల్సిందే


హైద్రాబాద్ బిర్యానీ రుచి చూసిన ఇవాంకా ట్రంప్‌తో పాటు జీఈఎస్ సదస్సుకు వచ్చిన ప్రతినిధులంతా ఫిదా అవ్వాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ముఖ్య అధికారులు అభిప్రాయపడుతున్నారు. హైద్రాబాద్ బిర్యానీని ప్రతినిధులకు రుచి చూపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోడీ ఇచ్చే విందులో కూడ హైద్రాబాద్ బిర్యానీకి చోటు దక్కింది. నవంబర్ 29వ, తేదిన ఇవాంకా ట్రంప్‌తో పాటు జీఈఎస్ ప్రతినిధులకు తెలంగాణ ప్రభుత్వం గోల్కొండ కోటలో విందు ఇవ్వనుంది. ఈ విందులో తెలంగాణ వంటకాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. హైద్రాబాద్ బిర్యానీ, హలీంలకు చోటు కల్పించనున్నారు.

English summary
Hyderabad is gearing up for the American President Donald Trump's daughter Ivanka Trump. With high security in place, beautification of the city underway, now Hyderabad is getting ready to impress the US President’s daughter with tantalising local cuisine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X