సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇవాంకకు కానుక: సిద్ధిపేట గొల్లభామ చీరెల విశిష్టత ఇదీ

తెలంగాణలోని సిద్దిపేట పేరు వింటే ‘గొల్లభామ' చీరెలు టక్కున గుర్తొస్తాయి. రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఇలాకాలో సిద్ధిపేట ఉంది.

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

Samantha Selected Gollabhama Saree For Ivanka Trump | Oneindia Telugu

హైదరాబాద: తెలంగాణలోని సిద్దిపేట పేరు వింటే 'గొల్లభామ' చీరెలు టక్కున గుర్తొస్తాయి. రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఇలాకాలో సిద్ధిపేట ఉంది. హీరోయిన్ సమంత తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాటికి గుర్తింపు తెచ్చారు.

సిద్ధిపేట పేరు విన్నా, గొల్లభామ పేరు విన్నా మహిళలకు ఆ అందమైన చేనేత చీర గుర్తుకువస్తుంది. పాల కడవతో ఒయ్యారంగా నడచివెళ్లే గొల్లభామల బొమ్మలను చీరలోను, దాని అందమైన అంచుల్లోను రెండుదారాల అల్లిక పద్ధతిలో కలనేసి ఆకట్టుకునేలా ఉండే గొల్లభామ చేనేత చీరలు ఎంతో ప్రశస్తికెక్కాయి.

అయితే నైపుణ్యం ఉన్న కార్మికులు కష్టపడి, ఇష్టంగా నేసే గొల్లభామ చీరలకు ఇటీవలి దాకా అంతంత మాత్రం ఆదరణే ఉంటూ వచ్చింది. ప్రస్తుతం పరిస్థితిలో మార్పువచ్చింది. దీంతో మళ్లీ పాతరోజులు రావాలని గొల్లభామ చీరలు నేయగల నైపుణ్యం ఉన్న చేనేత కార్మికులు కోరుకుంటున్నారు.

సమంత ప్రోత్సాహం

సమంత ప్రోత్సాహం

గొల్లభామ చీరెలకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చి, మార్కెట్ విస్తరించేందుకు హీరోయిన్ సమంత నడుం బిగించారు. ఇందులో భాగంగానే ఆ చీరలను ఇవాంకకు ప్రదానం చేయాలని కూడా అనుకుంటున్నట్లు సమాచారం. తద్వారా గొల్లభామ చీరెలు మరింతగా ప్రపంచ పటం మీదికి ఎక్కుతాయనేది ఉద్దేశం.

అగ్గిపెట్టెలో పట్టే చీర..

అగ్గిపెట్టెలో పట్టే చీర..

అగ్గిపెట్టెలో పట్టే చీరలనుంచి బంగారంతో చేసే చీరలవరకు సృష్టించగల నేర్పు తెలుగు చేనేత కార్మికులకు ఉంది. గద్వాల, వెంకటగిరి, ధర్మవరం, మంగళగిరి, భూదాన్‌పోచంపల్లి, పొందూరు ఇలా ఎన్నో ప్రాంతాలు చేనేత రంగంలో ప్రత్యేకత సంతరించుకుని ప్రఖ్యాతి గాంచాయి.

గొల్లభామలే స్ఫూర్తి

గొల్లభామలే స్ఫూర్తి

చేనేత కళాకారుల్లో అమేయమైన సృజన దాగి ఉంది. సరికొత్త డిజైన్లతో వినియోగదారులను ఆకర్షించడం ఎలా అన్నది వారి ఆలోచన చేస్తూ ఉంటారు, అదే సమయంలో తమ ప్రత్యేకతను చాటుకోవాలని కూడా చూస్తుంటార. గొల్లభామ చీరల సృష్టికూడా అలా జరిగినదే. దాదాపు 70 ఏళ్ల క్రితంనాటి సందర్భం అది. సిద్దిపేటకు కీర్తిప్రతిష్టలు తెచ్చిన గొల్లభామల వైభవానికి చిహ్నం అది. అక్కడి చేనేత కళాకారుల ఆలోచనలకు సృజనాత్మకత తోడై గొల్లభామ చీరలు పురుడుపోసుకున్నాయి. పాలు అమ్మేందుకు వచ్చే మహిళలను చూసి వారికి వచ్చిన ఆలోచనల ఫలితమే గొల్లభామ చీరల తయారీ అని చెబుుతుంటారు.

ఆ ఇద్దరే సృష్టికర్తలు

ఆ ఇద్దరే సృష్టికర్తలు

సిద్దిపేటకు చెందిన ప్రముఖ చేనేత కార్మికులు రచ్చ దేవదాస్, కొంక సాయిలుతో కలిసి మరికొందరు సిద్దిపేట చేనేత సహకార సంఘంలో వస్త్రాలు నేస్తూ కుటుంబాలను పోషించుకునేవారు. అప్పట్లో జనతా, ముత్యంపేట, పటోల తదితర రకాల చీరలను నేసేవారు. వీటిపై అందమైన పువ్వులు, హంసలు, చేపలు, ఆకులు, పక్షలు తదితర బొమ్మల డిజైన్లతో మహిళలను ఆకట్టుకునేలా చీరలను నేస్తూ వచ్చారు. చీరలు నేసేటపుడు కార్మికులు విరామ సమయంలో చాయ్ తాగేందుకు సిద్దిపేట గాంధిచౌక్, వెంకటేశ్వరాలయం వద్ద గల హోటళ్లకు వెళ్లేవారు. ఆ కాలంలో వివిధ గ్రామాల నుండి పాలు, పెరుగు బుట్టలు, కుండల్లో పోసి తలపై వాటిని పెట్టుకుని మహిళలు తీసుకువచ్చి హోటళ్లలో విక్రయించేవారు.

ఇలా ముద్ర పడింది...

ఇలా ముద్ర పడింది...

హోటళ్లకు పాలు, పెరుగు పోయడానికి వచ్చిన గొల్లభామల రూపం చేనేత కార్మికుల ెమెదళ్లలో ముద్రపడింది. దీంతో వారు చీరలపై వేసే పూవులు, ఆకులు, చేపలు, హంస, పక్షులకు బదులుగా పాలను విక్రయించే గొల్లభామలను వేయాలని అనుకున్నారు. గొల్లభామల ఆకృతిలో డిజైన్లు తయారు చేసేందుకు కార్మికులు తీవ్రంగా శ్రమించి విజం సాధించారు. ఇంతటి చారిత్రకమైన ప్రాధాన్యత గల చీర స్వాతంత్య్రం సిద్ధించకముందే 1940లోనే పురుడుపోసుకొంది.

ఇలా ఉంటాయి..

ఇలా ఉంటాయి..

గొల్లభామ ఒక చేతితో తలపై పాలకుండ, మరో చేతితో పెరుగుకుండను పట్టుకున్నట్లు బొమ్మలు వచ్చేలా చీరల అంచులు, మధ్యలో, కొంగు భాగాల్లో నేశారు. ఎదురెదురుగా గొల్లభామలు వస్తున్నట్లు, స్వాగత తోరణాలలో వారున్నట్లు ఆకర్షణగా ఉండేలా వివిధ రంగులతో రూపొందించారు. అప్పటివరకు మార్కెట్‌లో లేని సరికొత్త గొల్లభామ చీరలు మహిళలను విశేషంగా ఆకర్షించాయి.

ఆ రోజుల్లో గిరాకీ...

ఆ రోజుల్లో గిరాకీ...

సిద్దిపేట గొల్లభామ చీరలకు అప్పట్లో డిమాండ్ పెరగడంతో సిద్దిపేట, దుబ్బాక, దుద్దెడ సహకార సంఘాల్లో వీటిని పెద్ద ఎత్తున నేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయాలు చేపట్టారు. దీంతో వీటికి దేశంలోని ముఖ్య పట్టణాలైన ఢిల్లీ, పంజాబ్, ఒడిస్సా, కలకత్తా తదితర ప్రాంతాల నుండి వేలాదిగా చీరలకు ఆర్డర్లు వచ్చాయి. ఇద్దరు ముగ్గురుతో ప్రారంభమైన గొల్లభామల చీరల తయారు ఎంతో మంది చేనేత కార్ికులకు ఉపాధి కల్పించే స్థాయికి చేరింది. ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో గొల్లభామ చీరలు నేసే నైపుణ్యం ఉన్న కార్మికులు రెండువేలమంది ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య పదుల్లోనే ఉంది.

2012లో జిఐ గుర్తింపు

2012లో జిఐ గుర్తింపు

సిద్దిపేట చేనేత కార్మికుల సృజనాత్మకతను చాటిచెప్పిన గొల్లభామ చీరల ప్రత్యేకతను భారత ప్రభుత్వం 2012లో గుర్తించింది. చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ ఈ చీరకు భౌగోళిక గుర్తింపు కల్పిస్తూ నెంబర్ 188 ఇస్తూ ప్రత్యేక చిహ్నాన్ని కేటాయించింది. దీంతో ఈ చీరలపై సిద్దిపేట చేనేత సహకార సంఘానికి పేటెంట్ హక్కులు లభించాయి.

జైల్‌సింగ్ నుంచి శంకర్ దయాళ్ శర్మ వరకు..

జైల్‌సింగ్ నుంచి శంకర్ దయాళ్ శర్మ వరకు..

అలనాటి రాష్టప్రతి జ్ఞానీ జైల్‌సింగ్‌కు గొల్లభామ చీరలంటే ఎంతో ఇష్టం. హైదరాబాద్ చేనేత ప్రదర్శనలో వీటి గురించి తెలుసుకుని ఇష్టపడ్డారు. ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి ఆ చీరలు తెప్పించుకున్న జైల్‌సింగ్ తన భార్యకు బహుమతిగా ఇచ్చేవారని చెబుతారు. శంకర్‌దయాళ్‌శర్మకూ ఈ చీరలంటే ప్రాణం. యుపి మాజీ ముఖ్యమంత్రి ఎన్‌డి తివారికి కూడా ఈ చీరలంటే ఇష్టమే. వీరంతా ప్రత్యేకంగా వీటిని తెప్పించుకునేవారు. ధరలు అందుబాటులో ఉండటం వల్ల మధ్యతరగతి మహిళలకు ఈ చీరలంటే మక్కువ చూపిస్తూ ఉండేవారు.

సమంత ఇలా...

సమంత ఇలా...

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తరపున చేనేతరంగానికి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సినీనటి సమంత అయితే గొల్లభామ చీరలను చూసినదే తడవుగా పెద్దసంఖ్యలో కొని తీసుకువెళ్లారు. వాటిని నేసే విధానం తెలుసుకున్నారు. ఈమధ్యే సిద్దిపేట వెళ్లిన ఆమె గొల్లభామ చీరల తయారీని స్వయంగా చూశారు. ఆదరణ లేక చేనేత కార్మికులు నిరుత్సాహానికి గురవడాన్ని గుర్తించారు. పరిస్థితులు మెరుగుపరిచేందుకు, ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం ఇచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు తనతోపాటు గొల్లభామ చీరలను ఇంటికి తీసుకువెళ్లడం విశేషం.

English summary
US president Donald Trump's daughter Ivanka Trump Hyderabad visit made Siddipet Gollabhama sarees a special.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X