హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Hyper Adi: తెలంగాణ ప్రజలకు హైపర్ ఆది క్షమాపణలు-ఆ స్కిట్‌పై వివరణ-వాంటెడ్‌గా చేయలేదని...

|
Google Oneindia TeluguNews

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. ఇటీవల 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోలో హైపర్ ఆది ప్రదర్శించిన స్కిట్‌పై తెలంగాణ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆది క్షమాపణలు చెప్పక తప్పలేదు. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని... అయినప్పటికీ తన తరుపున,ఆ స్కిట్ సందర్భంగా స్టేజీపై ఉన్న అందరి తరుపున క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు.

Hyper Adi: జాగృతి ఫిర్యాదుపై హైపర్ ఆది రియాక్షన్... తన ఒక్కడి మీదే రుద్దవద్దని...Hyper Adi: జాగృతి ఫిర్యాదుపై హైపర్ ఆది రియాక్షన్... తన ఒక్కడి మీదే రుద్దవద్దని...

'అందరికీ నమస్కారం... ఆంధ్రా,తెలంగాణ అనే బేధాభిప్రాయాలు మాలో ఎప్పుడూ ఉండవు. మేమంతా కలిసి చాలా సరదాగా పనిచేసుకుంటాం.ఎవరికి ఏ సమస్య కలిసి పరిష్కరించుకుంటాం. అన్ని ప్రాంతాల ప్రేమాభిమానాలు ఉంటేనే మేమందరం ఈరోజు ఇంతలా ఎంటర్టైన్ చేయగలుగుతున్నాం. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో బతుకమ్మ,గౌరమ్మ పాటలను ఉద్దేశించి కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. అది వాంటెడ్‌గా చేసినది కాదు. నా తరుపున,స్టేజీ మీద ఉన్న అందరి తరుపున క్షమాపణలు చెబుతున్నాను.' అని హైపర్ ఆది స్పష్టం చేశారు.

jabardasth comedian hyper adi apologized telangana people for his recent skit

ఇటీవల ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో బతుకమ్మపై హైపర్ ఆది టీమ్ స్కిట్‌ను ప్రదర్శించింది. స్కిట్‌లో భాగంగా బతుకమ్మ,గౌరమ్మలపై పాటలు పాడారు. ఈ సందర్భంగా హైపర్ ఆది తెలంగాణ సంస్కృతిని కించపరిచాడని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా బతుకమ్మపై అతను చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిపై హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసి.. అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. హైపర్ ఆది బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే హైదరాబాద్‌లో తిరగలేడని హెచ్చరించారు.

ఈ వివాదంపై మంగళవారం(జూన్ 15) ఆది వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిజానికి ఆ సమయంలో స్టేజీపై ఎవరేం పాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. గౌరమ్మ,బతుకమ్మ వంటి పదాలేవీ తన నోటి నుంచి రాలేదన్నారు.స్టేజీపై చాలామంది ఉన్నారని... ఎవరు బతుకమ్మ అన్నారో,ఎవరు గౌరమ్మ అన్నారో తెలియదని అన్నారు. ఆ స్కిట్‌కి సంబంధించిన స్క్రిప్ట్ తన చేతిలో ఉండదని... దానికి తాను టీమ్ లీడర్ కూడా కాదని చెప్పారు. తాను వెళ్లి జస్ట్ అందులో యాక్ట్ చేస్తానని తెలిపారు. అంతేకాదు,హైపర్ ఆది అలుసుగా దొరికాడని టార్గెట్ చేస్తున్నారనే తరహాలో ఆయన కామెంట్స్ చేశారు. తన ఒక్కడి పైనే ఇదంతా రుద్దవద్దని అన్నారు.ఒకవేళ తన తప్పు ఉంటే సారీ చెబుతానని అన్నారు.

Recommended Video

Etela Rajender పై మంత్రి జగదీశ్‌రెడ్డి ఘాటు విమర్శలు!!

ఆది చేసింది ముమ్మాటికీ తప్పేనని తెలంగాణ జాగృతి సభ్యులు పేర్కొన్నారు. ఓ టీవీ ఛానెల్ ద్వారా హైపర్ ఆదితో ఫోన్‌లో మాట్లాడారు.తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో దిగొచ్చిన ఆది క్షమాపణలు చెప్పక తప్పలేదు.

English summary
Jabardast comedian Hyper Adi has apologized to the people of Telangana. Adi has apologized for the skit performed on a recent show called 'Sridevi Drama Company'. in the wake of severe criticism from the people of Telangana he apologized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X