హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Hyper Adi: జాగృతి ఫిర్యాదుపై హైపర్ ఆది రియాక్షన్... తన ఒక్కడి మీదే రుద్దవద్దని...

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సంస్కృతిని కించపరిచేలా స్కిట్ ప్రదర్శించాడని తనపై పోలీసులకు అందిన ఫిర్యాదుపై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది స్పందించారు. తాను ఎక్కడా తెలంగాణ సంస్కృతిని కించపరచలేదని అన్నారు. అసలు ఆ స్కిట్‌కి సంబంధించిన స్క్రిప్ట్ తాను రాయలేదని... తాను కేవలం అందులో ఒక ఆర్టిస్టును మాత్రమేనని వెల్లడించారు. తనపై నమోదైన కేసుకు సంబంధించి ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ద్వారా జాగృతి సభ్యులతో ఆది ఫోన్‌లో మాట్లాడారు.

హైపర్ ఆది ఏమంటున్నారు...

హైపర్ ఆది ఏమంటున్నారు...

ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ... నిజానికి ఆ సమయంలో స్టేజీపై ఎవరేం పాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. గౌరమ్మ,బతుకమ్మ వంటి పదాలేవీ తన నోటి నుంచి రాలేదన్నారు.స్టేజీపై చాలామంది ఉన్నారని... ఎవరు బతుకమ్మ అన్నారో,ఎవరు గౌరమ్మ అన్నారో తెలియదని అన్నారు. ఆ స్కిట్‌కి సంబంధించిన స్క్రిప్ట్ తన చేతిలో ఉండదని... దానికి తాను టీమ్ లీడర్ కూడా కాదని చెప్పారు.
తాను వెళ్లి జస్ట్ అందులో యాక్ట్ చేస్తానని తెలిపారు. అంతేకాదు,హైపర్ ఆది అలుసుగా దొరికాడని టార్గెట్ చేస్తున్నారనే తరహాలో ఆయన కామెంట్స్ చేశారు. తన ఒక్కడి పైనే ఇదంతా రుద్దవద్దని అన్నారు.ఒకవేళ తన తప్పు ఉంటే సారీ చెబుతానని అన్నారు.

బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే : తెలంగాణ జాగృతి

బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే : తెలంగాణ జాగృతి

తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ మాట్లాడుతూ... హైపర్ ఆది బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. ఆ స్కిట్‌లో హైపర్ ఆది బతుకమ్మను కించపరిచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.హైపర్ ఆది బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే హైదరాబాద్‌లో తిరగనివ్వమని హెచ్చరించారు. సంపాదన కోసం,టీఆర్పీ రేటింగుల కోసం తెలంగాణ సంస్కృతి,భాషలను కించపరచడం సరికాదన్నారు. యావత్ తెలంగాణ ఆడపడుచులకు ఆది క్షమాపణలు చెప్పాలన్నారు. ఆదిపై తమకేమీ కక్ష లేదని... కానీ తెలంగాణను కించపరిస్తే ఊరుకునేది లేదని అన్నారు.

ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు

ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మ, తెలంగాణ యాస, భాషలను కించపరిచేలా హైపర్ ఆది స్కిట్ ప్రదర్శించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి ఫిర్యాదు చేసిన జాగృతి సభ్యులు హైపర్ ఆదిపై చర్యలు తీసుకోవాలని కోరారు.హైపర్ ఆదితో పాటు స్క్రిప్ట్ రైటర్,మల్లెమాల ప్రొడక్షన్‌‌పై కూడా చర్యలు తీసుకోవాలని జాగృతి సభ్యులు కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్, సమాచార హక్కు సాధన స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్తీక్, టీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి చింత మహేశ్, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ తదితరులు ఉన్నారు.

English summary
Jabardast comedian Hyper Aadi has responded on a complaint received by the police that the skit he performed to degrade Telangana culture. He said that he had not degraded the culture of Telangana anywhere. He said that he did not write the script for that skit ... he was just an artist in it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X