వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వంపై దూకుడు పెంచిన జెఎసి చైర్మెన్ కోడండరామ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై జెఎసి చైర్మెన్ కోదండరామ్ దూకుడును పెంచారు.అవకాశం వచ్చిన సందర్భాన్ని ఆయన ఉపయోగించుకొంటున్నారు.ప్రభుత్వం కూడ జెఎసి కార్యక్రమాలను ప్రత్యేకించి కోదండరామ్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తోంది.ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వాన్ని విమర్శలు చేయడం లేదని చెబుతున్నారు జెఎసి నాయకులు.

రాష్ట్రంలో గత కొంతకాలంగా జెఎసి చేపడుతున్న కార్యక్రమాల పట్ల ప్రభుత్వంలోని ముఖ్యులు విరుచుకుపడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగాను నెలకొన్న కరువు పరిస్థితులపై రాష్ట్రంలో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందనేది జెఎసి అభిప్రాయంగా ఉంది.

Jac chariman kondaram fight against govt polices

ఆరుమాసాల క్రితం జెఎసి నుండి కొన్ని సంఘాలు వైదొలగాయి. జెఎసి అవసరం లేదనేది ఆ సంఘాల వాదన. కాని....ప్రతి ఒక్కరికి ఫలాలు అందేవరకు జెఎసిని కొనసాగుతోందని ప్రకటించారు జెఎసి చైర్మెన్..రైతాంగ సమస్యలను తీసుకొని జెఎసి పనిచేసింది. సమగ్ర వ్యవసాయం విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది.ఈ విషయమై ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోయిందనేది జెఎసి వాదన.దీంతో ఇందిరాపార్క్ వద్ద దీక్షకు కూడ దిగింది.
రాష్ట్రంలోని విపక్షాలతో చేతులు కలిపి జెఎసి పనిచేస్తోందని అధికార టిఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ విమర్శలను జెఎసి తిప్పికొడుతోంది. సమగ్ర వ్యవసాయ విధానాన్ని అమలు చేయాలని కోరడం తప్పా అని ప్రశ్నిస్తోంది జెఎసి.రాష్ట్రంలోని ప్రతి రైతుకు రూ 93 వేల అప్పులున్నాయని జెఎసి చైర్మెన్ చెబుతున్నారు.అధికార పార్టీ విమర్శలకు ఆయన ఘాటుగానే సమాధానం చెబుతున్నారు.

మల్లన్న సాగర్ భూపోరాట నిర్వాసితులకు అండగా, రైతుల ఆత్మహాత్యలపై కోర్టులో పోరాటం తదితర అంశాలు ప్రభుత్వానికి జెఎసి పై మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి.అయితే విపక్షాల సహయపడేవిధంగా తాము పోరాటం చేస్తున్నామని అధికారపార్టీ చేసే విమర్శలు సరికావంటున్నారు కోదండరామ్.గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే దీక్షలకు దిగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.తమ వెనుక విపక్షాలు ఉన్నాయనే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.ఒక్క సిల్వర్ మెడల్ రాగానే క్రీడా పాలసీని రూపొందించేందుకు సిద్దమైన ప్రభుత్వం వ్యవసాయ విధానం పై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు కోదండరామ్.

English summary
ruling trs party target Jac activites in telangana. jac internal supporting opposition parties like this agitations alleged trs. but Jac chairmean condemened this type argument of ruling party.we are struggle for people said kodandaram.we said to govt several times what is situations of the farmers in the state, govt ignore our suggestions. so we are protest against the govt said kodandaram
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X