హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ నేత దారుణ హత్య... ఆ వివాదమే కారణం.. వారిపైనే అనుమానం...?

|
Google Oneindia TeluguNews

జడ్చర్ల కాంగ్రెస్ నేత,మాజీ సింగిల్ విండో ఛైర్మన్ రామచంద్రారెడ్డి(72) దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం(జూన్ 19) కిడ్నాప్‌కు గురైన ఆయన.. అదే రోజు రాత్రి పెంజర్ల గ్రామ సమీపంలో హత్యకు గురయ్యారు.భూ తగాదాలే ఆయన హత్యకు కారణంగా తెలుస్తోంది. అది కూడా రక్త సంబంధీకులే ఈ ఘాతుకానికి ఒడిగట్టారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామచంద్రారెడ్డి డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో మొదట కిడ్నాప్ ఉదంతం బయటపడింది.

ఆ భూమిపై వివాదం...

ఆ భూమిపై వివాదం...


పోలీసుల కథనం ప్రకారం.. షాద్ నగర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి అలియాస్ పెట్రోల్ బంక్ రామచంద్రారెడ్డి చాలా కాలంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. మహూబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగుతున్నారు. తన స్వగ్రామం అన్నారంలో రామచంద్రారెడ్డికి భూములున్నాయి. ఇందులో 9 ఎకరాలకు సంబంధించి తన బంధువులతో వివాదం నడుస్తోంది.

అడ్డుకున్న ప్రతాప్ రెడ్డి...

అడ్డుకున్న ప్రతాప్ రెడ్డి...

ఆ బంధువులు అమెరికాలో ఉంటున్నట్టు సమాచారం. దీంతో ఇక్కడి భూముల వ్యవహారాలను ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి చూసుకుంటున్నాడు. భూ వివాదం నేపథ్యంలో రామచంద్రారెడ్డి తరుచూ ఆ 9 ఎకరాల భూమి వద్దకు వెళ్లి పర్యవేక్షిస్తున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం కూడా తన కారులో అక్కడికి వెళ్లారు. తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోతున్న సమయంలో మార్గమధ్యలో ప్రతాప్ రెడ్డి ఆయన కారును అడ్డుకున్నారు. డ్రైవర్ పాషా కిందకు దిగానే కత్తి బయటకు తీసి చంపేస్తామని బెదిరించాడు. దీంతో అతను అక్కడి నుంచి పారిపోయి స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.

Recommended Video

నిందితులను చంపకుండా... జైల్లో మటన్ పెట్టి మేపుతున్నారు!! || Oneindia Telugu
కిడ్నాప్... హత్య...

కిడ్నాప్... హత్య...

ప్రతాప్ రెడ్డి అతనితో మనుషులతో వచ్చి తమను బెదిరించాడని.. రామచంద్రారెడ్డిని అదే కారులో ఎక్కడికో తీసుకెళ్లాడని పోలీసులకు పాషా ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. రామచంద్రారెడ్డి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేయగా.. కొత్తూరు మండలం పెంజర్లలో ఉన్నట్టు గుర్తించారు. హుటాహుటిన అక్కడికి చేరుకోగా... కారులోనే రామచంద్రారెడ్డి కత్తిపోట్లకు గురై విగతజీవిగా కనిపించారు. ఆయన మెడ,పొట్ట భాగంలో కత్తిపోట్లు ఉన్నట్టు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రతాప్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. బంధువుల డైరెక్షన్‌లోనే రామచంద్రారెడ్డి హత్య జరిగిందా.. లేక ప్రతాప్ రెడ్డి ఆయనపై కక్ష పెంచుకుని హత్యకు పాల్పడ్డాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Jadcharla congress leader Ramachandra Reddy was kidnapped and murdered by his opponents in Shadnagar on Friday night. Police identified his dead body in a car in an isolated place near Penjarla village
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X