• search
  • Live TV
మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మైనర్ బాలికలతో ఆడుకుంటున్న మరో రెడ్డి.. జడ్చర్లలో టెన్త్ క్లాస్ విద్యార్థిని దారుణ హత్య..!

|

జడ్చర్ల : టెక్నాలజీ మాయలో పడి మంచేదో చెడేదో తెలుసుకోలేని పరిస్థితి దాపురించింది. సోషల్ మీడియా వేదికగా ఫ్రెండ్‌షిప్ ముసుగులో జరుగుతున్న ఆకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. అరచేతిలో ప్రపంచం చూసే వరకు ఎదిగిన టెక్నాలజీని మంచి కోసం వాడకుండా చెడు పనుల కోసం ఎక్కువగా వినియోగిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆ క్రమంలో జడ్చర్లలో పదో తరగతిని విద్యార్థినిని దారుణంగా హత్య చేయడం కలకలం రేపుతోంది. ఫేస్‌బుక్ ఫ్రెండ్‌పై అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ దిశగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఎన్నికలు ఏవైనా విజయం మాదే.. ఆ ఎలక్షన్లపై కూడా కేటీఆర్ ధీమా..!

మొన్నటికి మొన్న నల్గొండ జిల్లాలోని హాజీపూర్ సైకో శ్రీనివాస్ రెడ్డి మైనర్ బాలికలే టార్గెట్‌గా రెచ్చిపోయిన ఉదంతం మరిచిపోకముందే.. ఇప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాలో మరో రెడ్డి టెన్త్ క్లాస్ విద్యార్థినిని దారుణంగా చంపిన ఘటన చర్చానీయాంశంగా మారింది. బాలికల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని రెచ్చిపోతున్న నిందితులకు సరైన శిక్ష పడితే గానీ ఇలాంటి ఘటనలకు ఫుల్‌స్టాప్ పడదేమోననే వాదనలు వినిపిస్తున్నాయి.

జడ్చర్లలో కలకలం.. పదో తరగతి విద్యార్థిని దారుణ హత్య

జడ్చర్లలో కలకలం.. పదో తరగతి విద్యార్థిని దారుణ హత్య

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జడ్చర్లకు చెందిన పదో తరగతి విద్యార్థిని హత్యకు గురైంది. మండలంలోని శంకరాయపల్లి ప్రాంతంలో సదరు విద్యార్థిని మృతదేహం గురువారం నాడు ఉదయం లభ్యం కావడం కలకలం రేపింది. ఎవరో బండరాయితో మోది చంపి పడేసినట్లుగా ఉన్న అక్కడి వాతావరణం చూసి పోలీసులు ఆ కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఫేస్‌బుక్ ఫ్రెండ్‌పై అనుమానాలు.. నవీన్ రెడ్డి అనే యువకుడిపై..!

ఫేస్‌బుక్ ఫ్రెండ్‌పై అనుమానాలు.. నవీన్ రెడ్డి అనే యువకుడిపై..!

టెన్త్ విద్యార్థినిని అత్యంత దారుణంగా చంపేశారనే వార్త స్థానికంగా సంచలనం రేపింది. అయితే ఫేస్‌బుక్ ద్వారా ఆ అమ్మాయికి ఇటీవల పరిచయమైన నవీన్ రెడ్డి అనే యువకుడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫేస్‌బుక్ ద్వారా ఆమెను పరిచయం చేసుకుని తద్వారా ఫోన్ నెంబర్ తీసుకుని తరచుగా మట్లాడుతూ ఇటీవల రెండు మూడు సార్లు కలిశాడనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఏమైందో ఏమో గానీ అనూహ్యంగా ఆమె శవమై కనిపించడం అలజడి రేపింది.

పోలీసుల అదుపులో నవీన్ రెడ్డి..!

పోలీసుల అదుపులో నవీన్ రెడ్డి..!

సదరు బాలిక రెండు రోజుల కిందట కనిపించకుండా పోయింది. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి కేసు కూడా నమోదు చేశారు. అంతలోనే ఆమె మృత్యువాత పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన నవీన్ రెడ్డి ఆమెను ఏమైనా చేసి ఉంటాడేమో అనే కోణంలోనూ డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఆ మేరకు నవీన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

 తస్మాత్ జాగ్రత్త.. ఫేస్‌బుక్‌తో ఫేక్ గాళ్లు రెచ్చిపోతున్నారు..!

తస్మాత్ జాగ్రత్త.. ఫేస్‌బుక్‌తో ఫేక్ గాళ్లు రెచ్చిపోతున్నారు..!

ఇటీవల ఫేస్‌బుక్ వేదికగా అమ్మాయిలతో పరిచయాలు పెంచుకుని అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా టీనేజీ అమ్మాయిలను 15 నుంచి 18 సంవత్సరాల వయసు లోపు అమ్మాయిలను ముగ్గులోకి దింపుతూ ఆ తర్వాత వారిని వేధిస్తున్న సంఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. ఆ వయసులో ఉన్నవారు మంచేదో చెడేదో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. అదే ఆసరాగా పోకిరీలు రెచ్చిపోతున్నారు. అమ్మాయిలను ట్రాప్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నారు. కాదు, కూడదంటే హత్యలు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. అయితే పిల్లలను ఓ కంట కనిపెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటున్నారు సైబర్ నిపుణులు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The worst Incident happened in Mahabubnagar district. A tenth grade student of the Jadcherla was charged with murder. The body of a student was found Thursday morning in the Shankarayapalli area. Her parents filed a case, Police were arrested her facebook friend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more