వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు, కేసీఆర్‌కు కేటీఆర్ యువరాజు, అంతా హరీష్ వల్లే.. సారీ చెప్పు: జగ్గారెడ్డి

|
Google Oneindia TeluguNews

సంగారెడ్డి/హైదరాబాద్: తెరాస సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆదివారం నిప్పులు చెరిగారు. హరీష్ తీరుతో ఏడుపాయల జాతరకు నీళ్లు లేవన్నారు. భక్తులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నాడు మంత్రిగా అత్యుత్సాహంతో సింగూరు నీళ్లు తరలించారని, ఇందుకు హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ రాష్ట్రానికి, కేసీఆర్‌కు కేటీఆర్ ఒక యువరాజు అన్నారు. 2017 సింగూర్ నుంచి నిజాం సాగర్ కు నీళ్లు మలించడం వల్లే సంగారెడ్డి, ఏడుపాయల దేవాలయానికి నీళ్లు ఇబంది వచ్చింన్నారు.

కర్ణాటక లో వరదలు వస్తేనే సింగూరు, మంజీర నిండుతాయని, సింగూర్, మంజీర నీళ్లలో ఉన్న మంచి గుణాలు గోదావరి నీళ్లలో లేవన్నారు. ఏడుపాయల జాతరకు నీళ్లు ఎక్కడ నుంచి ఇస్తాడో హరీష్ రావు చెప్పాలన్నారు. తనను రాజకీయంగా అణగదొక్కాలని హరీష్ ప్రయత్నం చేశారన్నారు. ఇందుకోసమే కేసీఆర్ వద్ద హరీష్ రావు అత్యుత్సాహంగా వ్యవహరించారని చెప్పారు. అవహగానాలేని హరీష్ రావు మంత్రిగా ఉండడంవల్లే ఏడుపాయల జాతర నీళ్ళు లేకుండా జరుపుకోవాల్సిన పరిస్థితి వస్తోందని అన్నారు. హరీష్ రావు సంగారెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పలన్నారు.ఇప్పుడు జిల్లాకి మంత్రి లేడని, కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం చూపాలని కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కేసీఆర్ నీళ్ళు తెప్పించాలన్నారు. బడ్జెట్ పైన ఎమ్మెల్యేగా సంగారెడ్డిలో ప్రజా అభిప్రాయాని సేకరిస్తానని చెప్పారు.

Jagga Reddy demand apology from Harish Rao over Singur water

ప్రజాభిప్రాయం తీసుకున్నాక ఈ బడ్జెట్ పై స్పందిస్తానని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలో తెరాస 40 -50 కోట్లు పెట్టగలని, కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెట్టలేరని చెప్పారు. 2018 లో కేసీఆర్ చెప్పిన ప్రతి మాటని నమ్మి ప్రజలు తెరాసకు ఓట్లు వేశారన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో, భవిష్యత్తులో పార్టీ పుంజుకోవాలంటే ఆచితూచి అడుగులు వేసే నాయకుడిని అధిష్టానం తీసుకురావాన్నారు. చాణక్యవ్యూహం, వ్యక్తిత్వం ఉన్న నేతకు అధికారం బాధ్యతలు ఇవ్వాలని, పీసీసీగా ఉత్తమ్ చాల సిన్సియర్‌గా పని చేస్తున్నాడని, భవిష్యత్తులో ఓటర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అలా వెళ్లాలని చెప్పారు.

English summary
Sangareddy Congress MLA Jagga Reddy demanded apology from former minister and TRS MLA Harish Rao over Singur water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X