వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కేసీఆర్ కు జగ్గారెడ్డి డిమాండ్ .. ధరణి నుండి వెనక్కి తగ్గినట్టే, ఎల్ఆర్ఎస్ ని వెనక్కి తీసుకోండి

|
Google Oneindia TeluguNews

సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ కు ఎల్ఆర్ఎస్ రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఎల్ఆర్ఎస్ విధానం తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రోజున గాంధీభవన్లో దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

 కేసీఆర్ మాయమాటల్లో ఎక్స్‌పర్ట్ .. ప్రతిపక్షాల ఓటమికి కారణమిదే : ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేసీఆర్ మాయమాటల్లో ఎక్స్‌పర్ట్ .. ప్రతిపక్షాల ఓటమికి కారణమిదే : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

బుధవారం ఉదయం 10 గంటల నుండి ఐదు గంటల వరకు డిమాండ్ తో చేస్తున్న దీక్షను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రారంభిస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దీక్షను విరమింపజేస్తారు. ఇక తాను చేపట్టిన దీక్ష గురించి మాట్లాడిన జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ కు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, డబ్బులు లేక నానా బాధలు పడుతున్నారని ఎల్ ఆర్ ఎస్ విధానాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు
. కరోనా కారణంగా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెబుతుందని, అలాంటప్పుడు ప్రజల దగ్గర డబ్బులు ఎలా ఉంటాయ్ అని ప్రశ్నించారు జగ్గారెడ్డి.

Jaggareddy demanded CM KCR to repeal LRS as people are in finanacial crisis

ప్రజలు ఎల్ఆర్ఎస్ కట్టలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ నుండి ఎలాగైతే వెనక్కి తగ్గారో అదే విధంగా ఎల్ఆర్ఎస్ ను వెనక్కి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విషయాన్ని సీఎం కేసీఆర్ గమనించాలన్నారు. తక్కువ రుసుముతో ప్లాట్లను రెగ్యులరైజ్ చేయాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని కోరుతూ బుధవారం రోజు దీక్ష చేపట్టనున్నారు జగ్గారెడ్డి.

అంతేకాదు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతులను మోసం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు . కేంద్ర అమలు చేస్తున్న మూడు వ్యవసాయ చట్టాలు వ్యతిరేకించిన సీఎం కేసీఆర్ ఢిల్లీకి పోయాక కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తానంటూ మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. రైతులకు కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన కాంగ్రెస్ ఎప్పుడూ పోరాటం చేస్తుందని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు.

తాజాగా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ విధానం పై నిప్పులు చెరిగారు .

English summary
Sangareddy MLA, Congress party senior leader Jaggareddy demanded that CM KCR abolish LRS. He said his decision to one day protest at Gandhi Bhavan on Wednesday was taken demanding immediate repeal of the LRS policy brought by the Telangana state government. He said people were in serious trouble they are not ready to pay the LRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X