ఇప్పటికీ సమైక్యవాదినే! కేసీఆర్‌ను తిట్టిన ఆ నేతలే కేబినెట్లో ఉన్నరు: బాల్క సుమన్‌కు జగ్గారెడ్డి వార్నింగ్
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అప్పుడు ఇప్పుడు కూడా సమైక్యవాదినేనని ఆయన స్పష్టం చేశారు. గతంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉన్న నేతలకు సీఎం కేసీఆర్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారని మండిపడ్డారు. ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న ఇతర పార్టీల నేతలు గతంలో కేసీఆర్ ను తీవ్రస్థాయిలో దూషించినవారేనని అన్నారు


కేసీఆర్‌ను తిట్టిన సమైక్యవాదులంతా తెలంగాణ కేబినెట్లోనే: జగ్గారెడ్డి
'కేసీఆర్‌ని బట్టలు ఇప్పి కొడుతానన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మీ టీఆర్ఎస్ ప్రభుత్వ క్యాబినెట్లో మంత్రే కదా..? ఉద్యమంలో కేసీఆర్ ఊరికించి కొడుతానన్న ఎర్రబెల్లి దయాకర రావు ఇప్పుడు మీ ప్రభుత్వ క్యాబినెట్లోనే లొనే ఉన్నాడు కదా..? మంత్రి పువ్వడా అజయ్ కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు నికర్సైనా స్వమైక్యవాదులే కదా.. ఉద్యమ సమయంలో టీఆరెస్ కార్యకర్తలను ఊరికించి కొట్టిన దానం నాగేందర్ ఇప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నాడు కదా..' అంటూ జగ్గారెడ్డి తన లేఖలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

నీ సంగతి చూస్తారంటూ బాల్క సుమన్‌కు జగ్గారెడ్డి వార్నింగ్
తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ఇంకా కేసీఆర్ పరిపాలనలో ఆంధ్ర కాంట్రాక్టర్లే కదా పని చేస్తోందని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఇది మీకు సిగ్గు అనిపించడం లేదా అని ఆయన దుయ్యబట్టారు. మరొక్కసారి మాట్లాడితే మీ మొత్తం చరిత్ర చెప్తానని జగ్గారెడ్డి హెచ్చరించారు. అంతేకాకుండా మా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు, మా కాంగ్రెస్ పార్టీ ఓయూ నాయకులు నీ సంగతి చూసుకుంటారులే' అంటూ బాల్క సుమన్‌కు వార్నింగ్ ఇచ్చారు జగ్గారెడ్డి.

సీఎం హోదాలో కేసీఆర్‌ను ఓయూకు తీసుకెళ్లలేదే..!: జగ్గారెడ్డి హెచ్చరిక
'రాహుల్
గాంధీని
పదే
పదే
ఉస్మానియా
యూనివర్సిటీకి
రావొద్దని
మాట్లాడుతున్నారని,
నువ్వు
ఎవడివి,
నీ
పార్టీ
ఏంది..
రాహుల్
గాంధీని
ఓయూకి
రావొద్దు
అనడానికి'
అంటూ
జగ్గారెడ్డి
మండిపడ్డారు.
మొన్నే
చెప్పిన
కదా
ఓయూ
మీ
అయ్యా
జాగిరా?
అని..
నువ్వు
రాహుల్
గాంధీపై
వ్యాఖ్యలకు
బేషరతుగా
క్షమాపణ
చెప్పాలని
జగ్గారెడ్డి
డిమాండ్
చేశారు.
ఈ
రోజే
క్షమాపణ
చెప్పాలి
లేకపోతే
ఆదివారం
మా
యూత్
కాంగ్రెస్,
ఎన్ఎస్యూఐ,
ఓయూ
కాంగ్రెస్
నేతలు
నీ
ఇంటి
ముందు
కూర్చొని
నీతో
క్షమాపణ
చెప్పిస్తారు
అని
జగ్గారెడ్డి
హెచ్చరించారు.
నీ
మొగతనం
ఏంటో
రేపు
మా
వాళ్ళు
తెలుస్తారు..
రేపు
మా
వాళ్ళు
వస్తారు..
బుధవారం
మే
4వ
తేదీన
నేను
మినిస్టర్
క్వాటర్స్‌కి
వస్తున్నట్లు
తెలిపారు.
కేసీఆర్‌ని
ముఖ్యమంత్రి
హోదలో
ఉస్మానియా
యూనివర్సిటీకి
తీసుకుపోలేని
మీలాంటి
దద్దమ్మలు
టీవీలో
మాట్లాడుతారా'
అంటూ
జగ్గారెడ్డి
తీవ్రస్థాయిలో
ధ్వజమెత్తారు.