వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు .. పార్టీ మారతానో లేదో కాలమే నిర్ణయిస్తుందన్న జగ్గారెడ్డి

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల ముందు షాక్ ఇచ్చి ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీకి జంప్ అవ్వాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతుంది. అందులో గండ్ర విషయంలో క్లారిటీ వచ్చేసింది. తన భార్యతో సహా గండ్ర టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నట్టు ప్రకటన చేశారు. కేటీఆర్ తో భేటీ అయిన గండ్ర ఆ విషయాన్ని వెల్లడించారు. ఇక జగ్గారెడ్డి కూడా పార్టీ ఫిరాయించనున్నారు అని వార్తలు వచ్చిన నేపధ్యంలో తన పార్టీ మార్పుపై జగ్గా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఫెడరల్ ఫ్రంట్ కథ కంచికేనా ..! సార్వత్రిక ఎన్నికల వేళ కేసీఆర్ మౌనం దేనికి సంకేతం ?ఫెడరల్ ఫ్రంట్ కథ కంచికేనా ..! సార్వత్రిక ఎన్నికల వేళ కేసీఆర్ మౌనం దేనికి సంకేతం ?

పార్టీ మార్పుపై స్పందించిన జగ్గారెడ్డి .. కాలమే నిర్ణయిస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

పార్టీ మార్పుపై స్పందించిన జగ్గారెడ్డి .. కాలమే నిర్ణయిస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తాను పార్టీ మారనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించకుండా దాన్ని కాలమే నిర్ణయిస్తుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిసారి ఈ ప్రచారంపై స్పందించడం, వాటిని ఖండించడం చేస్తున్నానని కానీ వాటికి ఎలాంటి విలువ లేకుండా పోతోందని అన్నారు. అందుకే ఈసారి ఖండించటం లేదని టీఆర్ఎస్ లోకి వెళతానో, లేదో కాలమే నిర్ణయిస్తుందని అంతవరకు ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని మాత్రం జగ్గారెడ్డి సూచించారు. జగ్గారెడ్డి ఈ తరహా స్పందన ఆయన పార్టీ మార్పుకు సానుకూలంగా ఉన్నట్టే అన్న భావన కలిగిస్తుంది.

తన పోరాటం టీఆర్ఎస్ మీద కాదు హరీష్ రావు మీద అని చెప్తున్న జగ్గారెడ్డి

తన పోరాటం టీఆర్ఎస్ మీద కాదు హరీష్ రావు మీద అని చెప్తున్న జగ్గారెడ్డి

ఇక అంతే కాదు తన పోరాటం టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాదని గతంలో తమ జిల్లాకు అన్యాయం చేసిన మాజీ మంత్రి హరీష్ రావుపైన మాత్రమే అని జగ్గారెడ్డి మరో సంచలన వ్యాఖ్య చేశారు . ప్రస్తుతం వేసవి సందర్భంగా తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడిందని దీనికి హరీష్ రావు కారణమని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.ఆయన అనాలోచిత నిర్ణయాల వల్ల సంగారెడ్డి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అందుకే తాను నష్టపోయిన సంగారెడ్డి ప్రజల తరపున మాట్లాడుతున్నానని చెప్పారు.

టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలతోనే పార్టీ మారుతున్నారని జగ్గారెడ్డి ప్రకటన

టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలతోనే పార్టీ మారుతున్నారని జగ్గారెడ్డి ప్రకటన

టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలతోనే వారు పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతంగానే వుందని ఎమ్మెల్యేలు ఎవ్వరు తమంతట తాముగా పార్టీ మారాలని అనుకోవడం లేదన్నారు. ఈ వలసలను అడ్డుకోడానికి టిపిసిసి నాయకులు కూడా సమర్థవంతంగానే ప్రయత్నిస్తున్నారని కానీ అడ్డుకోలేకపోతున్నారని అన్నారు. ఏ పార్టీని పూర్తిగా రాష్ట్రంలో లేకుండా చేయడం అసాధ్యమని జగ్గారెడ్డి తెలిపారు.కాంగ్రెస్ ను నాయకులు వీడినా పరవాలేదని క్యాడర్ అలాగే పార్టీలోనే వుంటోందని పేర్కొన్నారు. మొత్తానికి జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు అన్నీ ఆయన పార్టీ మార్పువైపు మొగ్గు చూపిస్తున్నాయి అన్న సంకేతాలను ఇస్తున్నాయి.

English summary
The TRS party has tied the knot on the Congress party without the status of opposition in the assembly. That is why the Congress party MLAs are trying to attract with the operation akarsh . If Congress MLAs join in TRS, the legislature will be dissolved in the legislative assembly. Senior leaders Sagareddy MLA Jayaprakash Reddy is in the defective MLA's list. on this Jagga reddy responded that time will decide everything and also he said that the i'm not the rival to the TRS party i'm only rival against Harishrao he stated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X