వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లాన్: తెరాసలోకి జంపన్న, పాలకుర్తి నుంచి పోటీ, ఎర్రబెల్లికి జనగాం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుల్లో ఒక్కడైన గినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న లొంగుబాటు ఆశ్చర్యకరమైన విషయమే. గినుగు నర్సింహా రెడ్డి జన జీవన స్రవంతిలో సాధారణ జీవితం గడుపుతారా, ఏమైనా ప్లాన్ ఉందా అనే చర్చ సాగుతోంది.

జంపన్నపై మాయిస్టు నేత అభయ్ పేరు మీద ఓ ప్రకటన విడుదలైంది. జంపన్నను ఏడాది క్రితమే సస్పెండ్ చేశామని ఆయన చెప్పారు. ఏడాది పాటు ఆయన ఎక్కుడున్నారనేది అంతు బట్టని విషయం. రాజకీయ స్వార్థంతోనే జంపన్న లొంగిపోయాడని అభయ్ విమర్శంచారు. అది ఏ రాజకీయ స్వార్థం అనేది ప్రశ్న.

ప్రచారం ఇలా సాగుతోంది...

ప్రచారం ఇలా సాగుతోంది...

ప్రజా జీవితంలోకి వచ్చిన జంపన్న మామూలు జీవితం గడుపుతారని ఎవరూ అనుకోవడం లేదు. ఆయన పార్లమెంంటరీ రాజకీయాల్లోకి అడుగు పెడుతారని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఎందరో మాజీలను తనలో ఇముడ్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆయనను కూడా ఇముడ్చుకోవడానికి సిద్ధపడిందనే ప్రచారం స్థానికంగా సాగుతోంది.

పాలకుర్తి నుంచి జంపన్న పోటీ...

పాలకుర్తి నుంచి జంపన్న పోటీ...

తెరాసలో చేరి జంపన్న పాలకుర్తి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. పాలకుర్తిని ఎన్నుకోవడానికి కారణం కూడా ఉందని అంటున్నారు. పాలకుర్తి ప్రధానమైన నక్సలైట్ నాయకులకు స్వంత ప్రాంతం. మావోయిస్టు భావజాలం కూడా ఎక్కువే ఉంటుంది. అందువల్ల గినుగు నర్సింహారెడ్డి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అయితే, ఇదంతా తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కెసిఆర్ ఇష్టపడితేనే జరుగుతుంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అది కచ్చితంగా జరుగుతుందని ఇప్పుడు చెప్పడం వీలు కాదు.

మరి ఎర్రబెల్లి ఎక్కుడి నుంచి...

మరి ఎర్రబెల్లి ఎక్కుడి నుంచి...

పాలకుర్తి నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామకు మారే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభకు ఎన్నకైన ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రస్తుతం తెరాసలో ఉన్నారు.

ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఏమవుతారు...

ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఏమవుతారు...

జనగామ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టికెట్ గల్లంతు కావచ్చుననే ప్రచారం జరుగుతోంది. కొమురెల్లి మూల విగ్రహం తొలగింపు నుంచి బతుకమ్మకుంట భూవివాదం నుంచి రిజర్వేషన్ల వ్యతిరేకత వరకు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పలు వివాదాల్లో చిక్కుకున్నారు. దీంతో ఆయనపై కెసిఆర్ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఆయనకు తెరాస టికెట్ లభించడం కష్టమేనని అంటున్నారు.

English summary
Local Buz is that surrendered Maoist leader Ginugu Narsimha Reddy alias Jampanna may join in Telangana Rastra samithi (TRS).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X