వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటిషోళ్లే నా సలహాలు తీసుకున్నారు!: కేసీఆర్ సర్కారుపై జానా విసుర్లు!‘కొత్త జిల్లాలు వారికోసమే’

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టిఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ సీఎల్పీ నేత, సీనియర్ ఎమ్మెల్యే జానారెడ్డి విమర్శల వర్షం గుప్పించారు. హైదరాబాదులో బుధవారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన కేసీఆర్ సర్కారుపై ఆసక్తికర ఆరోపణలు చేశారు.

ట్రిటిష్ వాళ్లే తన సలహాలు తీసుకుంటే.. ప్రస్తుత కేసీఆర్ సర్కారు మాత్రం అందుకు విరుద్ధంగా తమ సూచనలను పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల విభజన రాజకీయ అవసరాల కోణంలోనే జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jana Reddy fires at KCR Government

బయ్యారం గనులను దక్కించుకునేందుకు... బయ్యారం, గార్ల ప్రాంతాలను మహబూబాబాద్‌లో కలిపేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. బ్రిటిషన్ హైకమిషనర్ బుధవారం హైదరాబాదులో పర్యటించిన నేపథ్యంలోనే జానారెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

వారికోసమే కొత్త జిల్లాల ఏర్పాటు: శ్రీధర్ బాబు

తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాల అంశంపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ తన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావుల కోసమే ఈ కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.

Jana Reddy fires at KCR Government

కేసీఆర్ కూతురు కవిత కోసం నిజామాబాద్ జిల్లా ఉందని, కేటీఆర్ కోసం సిరిసిల్ల, హరీశ్ కోసం సిద్ధిపేటలను ఇప్పుడు జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారన్నారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరిగితే తాము సంతోషిస్తామని, కుటుంబసభ్యుల కోసం చేస్తే మాత్రం ఊరుకోమని అన్నారు. కరీంనగర్‌లోని గంగాధర మండలాన్ని సిరిసిల్లలో కలపడం సీఎం స్వార్ధ రాజకీయాలకు అద్దం పడుతోందని శ్రీధర్ బాబు విమర్శించారు.

English summary
Congress leader Jana Reddy fired at KCR's Telangana Government for not receiving his suggestions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X