వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణాదికి ఎంతిచ్చారు, ఉత్తరాది అహంకారం మీదంటూ పవన్ సంచలనం

బిజెపి ఎంపి తరుణ్ విజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జనసేన చీఫ్, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఘాటుగానే స్పందించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బిజెపి ఎంపి తరుణ్ విజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జనసేన చీఫ్, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఘాటుగానే స్పందించారు.

దక్షిణ భారతం నుండి ఎంత తీసుకొన్నారు. ఎంత తిరిగి ఇచ్చారు అంటూ ట్విట్టర్ ద్వారా ఆయన తన ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.

pavan kalyan

దక్షిణాది, ఉత్తరాధి అంటూ విభేదించి మాట్లాడిన బిజెపి ఎంపి తరుణ్ విజయ్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.నల్లగా ఉన్న దక్షిణ భారతీయులు ఇచ్చే రెవిన్యూ కావాలి, కాని వారి మీద చిన్నచూపు ఉంది మీకు అంటూ ఆయన దుయ్యబట్టారు.

ఈ రకమైన భావజాలం ఉన్న వ్యక్తులు వాళ్ళకి చోటు ఇచ్చే పార్టీలు జాతీయ స్థాయిలో ఉండడం మన దౌర్బాగ్యం అంటూ ట్విట్టర్ వేదికగా విరుచుకు పడ్డారు.

నల్లగా ఉన్నవి వద్దనుకొంటే కోకిలను నిషేధించండి, మీరు ఎగరేసే జాతీయ పతకాన్ని దక్షిణాదికి చెందిన ఓ మహనీయుడు రూపకల్పన చేశారని ఆయన గుర్తు చేశారు.

ఉత్తరాది అహంకారాన్ని మీ మాటల్లో చూపారని చెప్పారు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన మర్చిపోయే అవమానం కాదన్నారు జనసేనాని.ఇలాంటి వివక్షలు జాతిని గీతలు గీసి మరీ విడదీస్తాయన్నారు.

ఏపికి ప్రత్యేక హోదా విషయంలో క్రితం ఉత్తరాది అహంకారం అంటూ ఆయన పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు.యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియా పేరుతో ఉన్న దక్షిణ భారత దేశ చిత్రపటాన్ని ఆయన ట్వీట్ చేశారు.

English summary
Jana sena chief cine actor pavan kalyan responded on Bjp MP Tarun Vijay controvorsy comments.differences between south and north in the BJP MP Tarun Vijay statement , he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X