హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జనగాం ఎన్‌కౌంటర్: 5గురు మిలిటెంట్లు ఎక్కడివారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వరంగల్ జిల్లా జనగామ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఐదుగురు మిలిటెంట్లు కూడా నేర చరిత్ర ఉన్నవారే. వికారుద్దీన్ గురించి చెప్పనే అక్కర లేదు. అతని చరిత్ర ఇప్పటికే అందరికీ అర్థమైంది. మిగతా నలుగురు ఎక్కడివారు, వారిపై ఉన్న కేసులేమిటో చూద్దాం...

-2010లో వికార్ అహ్మద్ నాయకత్వంలో అమ్జద్, మహ్మద్ జకీర్, మహ్మద్ అనీఫ్, మహ్మద్ రియాజ్ ఖాన్, మహ్మద్ అబ్దుల్ సయ్యిద్‌లు దాడులకు కుట్రపన్నారు. తెహరిక్ ఘల్బ-ఇ-ఇస్లామ్ (టీజీఐ) వ్యవస్థను స్థాపించిన ఫసియుద్దీన్‌ను ఆదర్శంగా తీసుకొని సొంత సంస్థను స్థాపించాలని పథకం వేశారు. షాలిబండ ప్రాంతంలో బందోబస్తు నిర్వహిస్తున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ యూ రమేశ్‌పై కాల్పులు జరిపి హత్య చేశారు. దీనిపై హుస్సేనీ ఆలం ఠాణాలో (క్రైం నం.87/2010) కేసు నమోదయ్యింది.

Janagaon encounter: Five millitants' criminal back ground

సయ్యద్ అమ్జద్ అలియాస్ ,సులేమాన్ అలియాస్ సల్మాన్

-సులేమాన్‌గా అందరికీ తెలిసిన ఇతను వికారుద్దీన్‌కు అనుంగ అనుచరుడు, దగ్గరి బంధువు కూడా. వికారుద్దీన్ నేరాలన్నింటిలో ఇతని పాత్ర ఉంది. వికార్ అహ్మద్‌తో కలిసి బంజారాహిల్స్, సరూర్‌నగర్ ఈ-సేవా కేంద్రాలలో దోపిడీకి పాల్పడ్డాడు. గుజరాత్‌లో కానిస్టేబుల్ హత్యకేసు, సైదాబాద్‌లో వాహనం దొంగతనం, చిక్కడపల్లిలో ఆయుధాల కేసు, కంచన్‌బాగ్, ఫలక్‌నుమా, హుస్సేనీ ఆలం ఠాణాల పరిధిలో పోలీసులపై కాల్పుల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. క్రైం నం.566/2007 (బంజారాహిల్స్), 1345/2007(సరూర్‌నగర్), 238/2007 (కాగ్డపిత్), 389/2007(మణినగర్), 402/2008 (సైదాబాద్), 528/2008 (చిక్కడ్‌పల్లి), 358/2008 (కంచన్‌బాగ్), 157/2009 (ఫలక్‌నుమా), 87/2010 (హుస్సేనీఆలం), 446/2010 (ఉప్పల్), 64/2011(కుషాయిగూడ), భువనగిరి ఠాణాలో కేసులు నమోదయ్యాయి.

మహ్మద్ జకీర్

-ఫలక్‌నుమా, హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్ల పరిధిలో పోలీసులపై కాల్పులు జరిపి హత్యచేసిన ఘటనలో క్రైం నం.157/2009 (ఫలక్‌నుమా), 87/2010 (హుస్సేనీ ఆలం) ఠాణాలో నమోదయిన కేసులలో నిందితుడు.

Janagaon encounter: Five millitants' criminal back ground

ఇజార్ ఖాన్

-ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇజార్ పోలీసులపై కాల్పులు, హత్య కేసులలో (క్రైం నం.157/2009- ఫలక్‌నుమా, 87/2010- హుస్సేనీ ఆలం, 238/2007- కాగ్డపిత్, 389/2007- మణినగర్, 64/2011- కుషాయిగూడ), భువనగిరిలో ఎస్కార్ట్ సిబ్బందిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నాడు.

Janagaon encounter: Five millitants' criminal back ground

మహ్మద్ హనీఫ్

-పోలీసులపై కాల్పులు, హత్య కేసులలో ఇతడు నిందితుడు. ఇతనిపై క్రైం నం.157/2009 (ఫలక్‌నుమా), 87/2010 (హుస్సేనీ ఆలం), 238/2007 (కాగ్డపిత్), 389/2007 (మణినగర్), 64/2011 (కుషాయిగూడ), భువనగిరిలో జరిగిన ఎస్కార్ట్ సిబ్బందిపై దాడి కేసులున్నాయి.

Janagaon encounter: Five millitants' criminal back ground
English summary
Under the leadership of Viqaruddin other four militants, who were killed in Janagaon encounter were having criminal records.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X