• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సాగర్‌కు జానారెడ్డి చేసిందేమీ లేదు.. ఉపఎన్నికలో టీఆర్ఎస్‌దే గెలుపు... బీజేపీకి డిపాజిట్ దక్కదు : బాల్క సుమన్

|

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్ పార్టీనే ఆదరిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధీమా వ్యక్తం చేశారు.ఉపఎన్నికలో టీఆర్ఎస్ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తుందన్నారు. సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చేసిందేమీ లేద‌న్నారు. టీఆర్ఎస్ పార్టీ ప‌ట్ల నాగార్జున సాగ‌ర్ ప్ర‌జ‌లు మంచి ఆద‌ర‌ణ చూపుతున్నార‌ని చెప్పారు. న‌ల్గొండ జిల్లాలో గురువారం(మార్చి 26) ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాగార్జునసాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు మంత్రిగా ప‌ని చేసిన జానారెడ్డి.. సొంత నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోలేదని విమర్శించారు.నియోజకవర్గ వెనుక‌బాటుకు జానారెడ్డే కారణమని అన్నారు.మండ‌లానికో సామంత‌రాజును పెట్టుకుని న‌డిపించారని... బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌ను జానారెడ్డి ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌లేదని విమర్శించారు. ఆ సామంత‌రాజులే చెప్పిందే జానారెడ్డికి వేదం అన్నారు. నియోజకవర్గంలో 1400 డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేస్తే.. వాటిని పేద వర్గాలకు ఇవ్వలేదన్నారు.

 janareddy did nothing for nagarjunasagar trs will win by election says mla balka suman

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌నే నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని స్థానికులు చెప్తున్నట్లుగా తెలిపారు. నియోజకవర్గంలోని స‌బ్బండ వ‌ర్గాలు టీఆర్ఎస్ పార్టీకి వెల్లువ‌లా మ‌ద్ద‌తు తెలుపుతున్నాయని చెప్పారు. ఇటీవ‌లే ప‌లు ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాప‌న చేసిన విషయాన్ని గుర్తుచేశారు. హాలియాలో డిగ్రీ కాలేజీ ప‌నులు జ‌రుగుతున్నాయని... నియోజకవర్గంలో విద్యుత్ వ్య‌వ‌స్థ‌ను కూడా మెరుగుప‌రుస్తున్నామని చెప్పారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తండాల‌కు పూర్తిగా రాజ్యాధికారం క‌ల్పించామని బాల్క సుమన్ వెల్లడించారు. మిష‌న్ భ‌గీర‌థ కింద అన్ని గ్రామాల‌కు సుర‌క్షిత తాగునీరు స‌ర‌ఫ‌రా చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజాసంక్షేమ పాలన కొనసాగిస్తోందన్నారు. సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి అరాచక పాలన సాగించారని... జానారెడ్డి పాల‌న‌ను, దివంగ‌త ఎమ్మెల్యే నోముల ప‌రిపాల‌న‌ను ఒకసారి సరిపోల్చుకోవాల‌ని ప్రజలకు సూచించారు.

ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో మ‌రోసారి సాగర్‌లో అధికారంలోకి రాబోతున్నామని చెప్పారు. నాగార్జున సాగ‌ర్‌ను ఇప్ప‌టికే అన్నివిధాలా అభివృద్ధి చేశామని.. భవిష్యత్తులో మ‌రింత అభివృద్ది పథంలో నడిపిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ వ‌ల్లే అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. కాంగ్రెస్,బీజేపీ రెండు జాతీయ పార్టీలు తెలంగాణ‌కు న‌ష్టం క‌లిగిస్తున్నాయన్నారు. సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో బీజేపీ డిపాజిట్లు గ‌ల్లంతవ‌డం ఖాయ‌మ‌ని సుమన్ పేర్కొన్నారు. కాగా,ప్రస్తుతం బాల్క సుమన్ సాగర్ నియోజకవర్గంలోనే మకాం వేసి ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపుకు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.

English summary
TRS MLA Balka Suman said that the people of the Nagarjunasagar constituency will support the TRS party in the coming by-election. TRS will win the by-election with a huge majority,he added. Senior Congress leader Janareddy has done nothing for the development of Sagar constituency,Suman criticised.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X