వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పారిశ్రామికవేత్తలకు కోట్లు సబ్సిడీ, రైతులకు రూ. 5వేలేనా? మిర్చి కొనుగోలులో వివక్ష ఎందుకన్న పవన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కేంద్రంలోని ఎన్ డి ఏ పై మరోసారి జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. మిర్చి రైతులకు కేవలం రూ5 వేలను మద్దతు దర ప్రకటించడం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.రెండు రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరైందికాదన్నారు.

పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రూపాయాలను సబ్సిడీలుగా ఇచ్చే ప్రభుత్వం రైతాంగానికి కేవలం రూ5 వేలు మాత్రమే ప్రకటించడం పట్ల ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు.

Janasena chief Pawan kalyan demanded to union government to procure chilli from farmers

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 88,300 మెట్రిక్ టన్నులు, తెలంగాణలో 33,700 మెట్రిక్ టన్నుల మిర్చిని కొనుగోలు చేయాలని కేంద్రం భావించడం సరైందికాదన్నారు. రెండు రాష్ట్రాలను సమానంగా చూడాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

రెండు రాష్ట్రాల మిర్చి రైతాంగానికి మద్దతు ధరను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ మేరకు తెలంగాణలో కూడ రైతాంగం వద్ద ఉన్న మిర్చిని కూడ కోనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Janasena chief Pawan kalyan demanded to union government to procure chilli from farmers in Telugu states.He wrote a letter to union government on Friday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X