హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిరాడంబరంగా: ఏపీలో అద్దె ఇంట్లోకి.. హైదరాబాద్‌లో జనసేన కొత్త కార్యాలయం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

విజయవాడ లో పవన్ కొత్త అద్దె ఇల్లు

హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నవ్యాంధ్ర ప్రదేశ్‌లో కొత్త ఇంట్లో అడుగు పెట్టారు. సొంత ఇల్లు పూర్తి కాకపోవడంతో విజయవాడలోని పడమటలంకలో అద్దె ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. ఓ వైపు పవన్ నవ్యాంధ్రలో కొత్త ఇంట్లోకి ప్రవేశించిన రోజే హైదరాబాదులో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభమైంది.

చాన్నాళ్లకు ఒకే వేదికపై పవన్-చంద్రబాబు: 'శ్రీవారి ఆభరణాలపై.. మీ వ్యవహారం దేశమంతా చూస్తోంది'చాన్నాళ్లకు ఒకే వేదికపై పవన్-చంద్రబాబు: 'శ్రీవారి ఆభరణాలపై.. మీ వ్యవహారం దేశమంతా చూస్తోంది'

ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం అంటూ శుక్రవారం దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జనసేన లేదా పవన్‌కు ఓకే రోజు రెండు శుభకార్యాలు. హైదరాబాదులోని మాదాపూర్‌లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభమైంది.

 జనసేన పార్టీ కార్యాలయం

జనసేన పార్టీ కార్యాలయం

జనసేన పార్టీ పాలన వ్యవహారాల కోసం నూతన కార్యాలయం ప్రారంభమైందని, హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని భవంతిలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని, శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి జనసేన నాయకులు, జన సైనికులు కార్యాలయంలోకి ప్రవేశించారని మీడియా హెడ్ హరిప్రసాద్ ప్రకటన విడుదల చేశారు.

 పార్టీకి సంబంధించిన వ్యవహారాల కోసం

పార్టీకి సంబంధించిన వ్యవహారాల కోసం

పార్టీకి సంబంధించిన పాలనా వ్యవహారాలను ఈ ప్రాంగణం నుంచి నిర్వహించాలని నిర్ణయించినట్లు హరిప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్, సేవాదళ్ ఇంచార్జ్ రియాజ్, పార్టీ ప్రముఖులు రత్నం, నగేష్, రామ్ తుళ్లూరి, అద్దెపల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ఇప్పటి దాకా విజయవాడ వస్తే హోటల్లో

ఇప్పటి దాకా విజయవాడ వస్తే హోటల్లో

కాగా, పవన్‌ శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లాలోని నంబూరు లింగమనేని టౌన్‌షిప్ వద్ద నిర్మించిన దశావతార వెంకటేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట కార్యక్రమానికి సంప్రదాయ వస్త్రధారణతో హాజరయ్యారు. అంతకుముందే అద్దె ఇంట్లో సతీమణితో కలిసి పూజలు నిర్వహించి, ఇంట్లోకి అడుగు పెట్టారు. ఇప్పటి వరకు విజయవాడకు ఎప్పుడు వచ్చినా హోటల్లో ఉంటున్నారు. ఇప్పుడు ఇంట్లో ఉండనున్నారు.

రెండు చోట్ల నిరాడంబరంగా

రెండు చోట్ల నిరాడంబరంగా

విజయవాడలోని అద్దె ఇంటితో పాటు, హైదరాబాదులోని పార్టీ కార్యాలయం.. రెండు కూడా నిరాడంబరంగా జరిగిపోయాయి. రామవరప్పాడు వద్ద ప్రారంభించిన జనసేన పార్టీ కార్యాలయాన్ని జిల్లా కార్యాలయంగా ఉంచాలని, కొత్తగా రాజధాని ప్రాంతంలో భూమి పూజ చేసిన రాష్ట్ర పార్టీ కార్యాలయం పనులు త్వరగా ప్రారంభింపజేయాలని, ఈ లోగా శుక్రవారం గృహప్రవేశం చేసిన నివాసంలో ఉంటూ పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ, ముఖ్యనేతలతో సమావేశాల నిర్వహణ చేయాలన్నది పవన్‌ ఆలోచన.

English summary
Jana Sena New party office opening ceremony in Hyderabad's Madhapur on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X