వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు జనసేన దూరం: కానీ, వారికి పవన్ కళ్యాణ్ మద్దతు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జనసేన పార్టీ ప్రకటించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో పార్టీ పరంగా గ్లాస్ గుర్తుతో పోటీ చేయడంలేదని పేర్కొంది.

ఈ ఎన్నికలలో పోటీచేయాలని ఆసక్తిఉన్న పార్టీ కార్యకర్తలు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీచేయడానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అనుమతి ఇచ్చారని ఆ పార్టీ ప్రకటనలో వెల్లడించింది.

ఎన్నికలలో పోటీచేసే కార్యకర్తలకు పార్టీ మద్దతు ఉంటుందని జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

 Janasena will stay away from Telangana Municipal elections

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే షెడ్యూల్ ప్రకటించారంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది.

ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం యథాతధంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

నామినేషన్ల స్వీకరణ: జనవరి 8 నుంచి 10 వరకు
నామినేషన్ల పరిశీలన: జనవరి 11
నామినేషన్ల ఉపసంహరణ గడువు: జనవరి 14
మున్సిపల్ ఎన్నికలు: జనవరి 22
ఓట్ల లెక్కింపు: జనవరి 25న

కాగా, తెలంగాణ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు హైకోర్టు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ముందుగానే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందంటూ, ఎన్నికలను వాయిదా వేయాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణ రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

English summary
Janasena will stay away from Telangana Municipal elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X