వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్ ... వైన్స్ బంద్ .. సండే మందుబాబులకు షాక్

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి , వివిధ రాజకీయ పార్టీల నుండి కూడా సానుకూల స్పందన వస్తుంది. అందరూ ముక్త కంఠంతో జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. జాతీయ విపత్తుగా కరోనా పరిణమిస్తున్న తరుణంలో మనమంతా ఐక్యంగా ఉన్నామని ఎలాంటి కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్తున్నారు. అయితే జనతా కర్ఫ్యూ సందర్భంగా వైన్స్ కూడా బంద్ చేస్తుండటంతో మందుబాబులకు షాక్ తగిలింది. ఆదివారం మందు కూడా లేకుండా చేస్తున్నారని తెగ ఫీల్ అవుతున్నారు మందుబాబులు .

తెలంగాణలో ఫస్ట్ లోకల్ కేసు .. కేపీహెచ్‌బీలో మహిళకు కరోనా పాజిటివ్తెలంగాణలో ఫస్ట్ లోకల్ కేసు .. కేపీహెచ్‌బీలో మహిళకు కరోనా పాజిటివ్

 జనతా కర్ఫ్యూను మరికొంత పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న కేసీఆర్

జనతా కర్ఫ్యూను మరికొంత పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న కేసీఆర్

ఇక కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన నేపధ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ జనతా కర్ఫ్యూను మరికొంత పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాలని పిలుపునిచ్చారు. అంతేకాదు బస్సులు రవాణా సాధనాలను ఆపేస్తున్నామని చెప్పారు .

రేపు వైన్ షాపులు బంద్

రేపు వైన్ షాపులు బంద్

దీంతో రేపు ఆర్టీసీ బస్సులు, మెట్రోలు సర్వీసులు సైతం నిలిపివేయనున్నారు . ఇక పాలు, కూరగాయలు లాంటి నిత్యావసరాల షాపులు, పెట్రోల్ బంక్‌లు నిర్వహించుకునేందుకు అనుమతించారు. ఇక జనతా కర్ఫ్యూ నేపధ్యంలో మందు బాబులకు షాక్ ఇచ్చారు సీఎం కేసీఆర్ . ఈ నేపథ్యంలో రేపు తెలంగాణలో వైన్ షాపులు కూడా బంద్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక కరోనా వ్యాప్తి నిరోధానికి ఇప్పటికే బార్లు, రెస్టారెంట్లు బంద్ చేశారు. కేవలం వైన్స్ మాత్రమే నడుస్తున్నాయి.

 తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా 2,400 వైన్ షాపులు క్లోజ్

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా 2,400 వైన్ షాపులు క్లోజ్

ఈ క్రమంలో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 2,400 వైన్ షాపులు మూతపడనున్నాయి. వైన్ షాపులు మూసివేస్తున్నట్టు తెలంగాణ వైన్స్ డీలర్స్ అసోసియేషన్ కూడా ప్రకటన విడుదల చేసింది. ఇక ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికే స్టేట్‌లో 700 బార్లు మూతపడ్డాయి. ఇప్పటికే బార్లు మూసివెయ్యటంతో వైన్స్ వద్ద జనాల సంఖ్యా పెరుగుతుంది. ప్రభుత్వం ఈ నేపధ్యంలో కరోనా ప్రభావం మరింత పెరిగితే వైన్స్ కూడా మూసేసే ఆలోచనలో ఉంది. అంతే కాదు అవసరం అనుకుంటే రాష్ట్రాన్ని షట్ డౌన్ చేసి ఇంటికే నిత్యావసరాలు పంపిస్తామని ప్రభుత్వం చెప్తుంది.

English summary
2,400 wine shops across the state will be shut down during the Janata Curfew tomorrow for corona control. The Telangana Wine Dealers Association has also announced the closure of wine shops. The government has already shut down 700 bars in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X