వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వికారాబాద్ జిల్లాలో ప్రధాని మోడీ సతీమణి పర్యటన

ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి జశోదాబెన్ శుక్రవారం జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలో ఉన్న నాగదేవత దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని

|
Google Oneindia TeluguNews

వికారాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి జశోదాబెన్ శుక్రవారం జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలో ఉన్న నాగదేవత దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు.

ఆ తర్వాత అన్నదాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని సంతోషిమాత దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గురువారం రాత్రి వికారాబాద్‌ పట్టణానికి చేరుకున్న ఆమె ఎలాంటి ఆడంబరాలకు తావివ్వకుండా నాగదేవత ఆలయ ప్రధాన అర్చకుడు బరాడి రమేశ్‌ ఇంట్లో బస చేశారు.

శుక్రవారం ఆమె ఇక్కడే ఉండి శనివారం మధ్యాహ్నం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి తిరుగుపయనం కానున్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, స్థానికులు ఆమెను చూసేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

jashoda ben visits Vikarabad district

వైభవంగా భద్రేశ్వరుడి పల్లకీ సేవ

తాండూరులోని భావిగీ భద్రేశ్వర జాతర ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. గురువారం రాత్రి ఆలయం నుంచి స్వామివారిని బయటకు తీసుకువచ్చి 'జై భద్రేశ్వర, జైజై భద్రేశ్వర' నినాదాలతో యాత్ర ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

భద్రేశ్వర ఆలయం నుంచి మహాత్మా గాంధీ కూడలి ముందున్న రాచన్న గుడి మీదుగా వ్యవసాయ విపణి వరకు స్వామి పల్లకి సేవ నిర్వహించారు. స్వామి వారి పల్లకీని మోసేందుకు భక్తులు పోటీ పడ్డారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

English summary
Prime Minister wife jashoda ben on Friday visited Vikarabad district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X