వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాహితను ట్రాప్ చేసిన ఎస్ఐ: భార్య ఉండగానే ఇంటికి, బెదిరింపులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వివాహితను జవహర్‌నగర్ ఎస్ఐ ట్రాప్ చేశారని ఆరోపిస్తూ ఆమె భర్త సతీష్ మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసు శాఖ సీరియస్‌గా స్పందించింది.నర్సింహులును హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ట్రయాంగిల్ లవ్: 3 ఏళ్ళు సహజీవనం, మరోకరితో లవ్, ప్రియుడికి ట్విస్ట్ ఇలా..ట్రయాంగిల్ లవ్: 3 ఏళ్ళు సహజీవనం, మరోకరితో లవ్, ప్రియుడికి ట్విస్ట్ ఇలా..

పోలీసు శాఖలో పనిచేస్తున్న కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆ శాఖ ప్రతిష్టను మంటగలిపేలా చేస్తోంది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వివాహితను ట్రాప్ చేసిన ఘటన హైద్రాబాద్‌లో కలకలం రేపుతోంది.

భర్త మృతి, మరో యువకుడితో లవ్ ఎఫైర్, ట్విస్టిచ్చిన లవర్భర్త మృతి, మరో యువకుడితో లవ్ ఎఫైర్, ట్విస్టిచ్చిన లవర్

భార్య, ఇద్దరు పిల్లలున్నప్పటికీ , ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మరో వివాహితను ట్రాప్ చేయడమే కాదు వివాహిత భర్తను బెదిరించాడని బాధితుడు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై బాధితుడు ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్ఐ భాగోతం బయటపెట్టాడు

 ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వివాహితను ట్రాప్ చేసిన ఎస్ఐ

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వివాహితను ట్రాప్ చేసిన ఎస్ఐ

హైద్రాబాద్ నగరంలోని జవహర్ నగర్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వివాహితను ఎస్ఐ ట్రాప్ చేశారని ఆమె భర్త సతీష్ మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర్‌రావుకు ఫిర్యాదు చేశారు. భార్య, భర్తల మధ్య ఇటీవలకాలంలో చిన్న గొడవ చోటు చేసుకొంది. దీంతో ఫిర్యాదు చేసేందుకు వివాహిత జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొంది. అయితే వివాహితను ఎస్‌ఐ ట్రాప్ చేశారని ఆమె ర్త సతీష్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

వివాహితకు క్రెడిట్ కార్డు ఇచ్చిన ఎస్ఐ

వివాహితకు క్రెడిట్ కార్డు ఇచ్చిన ఎస్ఐ

తన భార్యకు ఎస్ఐ తన క్రెడిట్ కార్డును కూడ ఇచ్చాడని వివాహిత భర్త సతీష్ ఆరోపించారు. ఈ క్రెడిట్ కార్డు సహయంతో ఆమె షాపింగ్ చేసిందని ఆయన చెప్పారు. మరో వైపు తన కొడుకు తనకు ఇచ్చేసి ఎస్ఐతో ఉంటానని ఆమె తనకు తెగేసి చెప్పిందని సతీష్ చెప్పారు. దీనికి అడ్డు చెప్పినందుకు తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని సతీష్ చెప్పారు.

 ఎస్ఐ భార్య చెబితేనే తెలిసింది

ఎస్ఐ భార్య చెబితేనే తెలిసింది

తన బార్యను ఎస్ఐ ఇంటికి కూడ తీసుకెళ్ళేవాడని సతీష్ చెబుతున్నాడు. ఎస్ఐ తన భార్య కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడని ఆయన భార్య తనకు ఫోన్ చేసి చెప్పిందన్నారు. ఎస్ఐ భార్య చెప్పేవరకు తన భార్య వ్యవహరం తనకు తెలియదన్నారు.ఆధారాలతో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.

బెదిరిస్తున్నారు

బెదిరిస్తున్నారు

నా భార్య విషయం నేను అడ్డుపడకుండా ఉండేందుకు గాను తనను బెదిరిస్తున్నారని సతీష్ చెబుతున్నారు. నాకు మొదటి వివాహమైంది. ఎస్ఐతో సన్నిహితంగా ఉన్న వివాహితను రెండో వివాహం చేసుకొన్నట్టు సతీష్ చెబుతున్నాడు. అయితే ఎస్ఐ నా అడ్డును తొలగించుకొనేందుకుగాను మొదటి భార్యను కూడ తిరిగి రంంగంలోకి తీసుకొస్తానని బెదిరిస్తున్నాడని సతీష్ చెప్పారు. కానీ వివాహిత మాత్రం సతీష్‌పై ఆరోపణలు చేస్తోంది.

English summary
Sub-Inspector Narasimham working at Jawahar Nagar police station has trapped a married woman who came to lodge a complaint against her husband. The SI’s extramarital affair with a lady came to the notice of Satish.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X