వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దు ప్రాంతాల్లో పేలిన మందుపాతర: పోలీసు మృతి

|
Google Oneindia TeluguNews

భూపాలపల్లి: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి 18 మంది పోలీసులకు తీవ్రగాయాలపాలయ్యారు. కాగా, ఒకరు మృతి చెందినట్లు సమాచారం. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా పరిధిలో మంగళవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు తెలిసింది.

ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలైనట్లు తెలిసింది. ఈ క్రమంలో బుధవారం పోలీసు బలగాలు బుల్లెట్ ప్రూఫ్‌ వాహనంలో గాలింపు చర్యలు చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన సీ 60 కమెండోలు 19 మంది బుల్లెట్ ప్రూఫ్‌ వాహనంలో గడ్చిరోలి జిల్లా బాంబ్రిఘడ్‌ తాలూకా పరిధిలో సంచరిస్తుండగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.

 Jawan killed as Maoists blast vehicle in Gadchiroli

18 మంది పోలీసులు గాయపడగా, సురేష్‌ అనే కమాండో మృతి చెందినట్లు సమాచారం. దీపక్‌, ప్రకాష్‌, జితేందర్‌ కొర్తెతోపాటు పలువురు గాయపడ్డారు. ఈ సంఘటనలో తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో అలజడి మొదలైంది. దీంతో తెలంగాణ ప్రాంత పోలీసులు ముందస్తు భద్రత చర్యలు తీసుకుంటున్నారు. సరిహద్దు గ్రామాలు, అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబీంగ్‌లు నిర్వహిస్తున్నారు.

English summary
A commando of the Maharashtra police’s special anti-Maoist unit C-60 was killed and 19 suffered injuries in an IED explosion triggered by Maoists in Gadchiroli district of Maharashtra on Wednesday night. This was the fourth such incident in Gadchiroli district bordering Chhattisgarh in the last 48 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X