వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌పై బీజేపీ వ్యూహాత్మకం: కేసీఆర్‌కు నితీష్ ఫోన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈ నెల 9వ తేదీన జరగనున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలలో తమకు మద్దతు తెలపాలంటూ జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఫోన్ చేశారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు.

రాజ్యసభలో ఇటు ఎన్డీయే, అటు యూపీఏ కూటమిలకు పూర్తి బలం లేదు. దీంతో బీజేపీ వ్యూహాత్మకంగా ఎన్డీయేలో మిత్రపక్షమైన జేడీయు ఎంపీకి అవకాశం ఇచ్చింది. తమ కంటే తమ మిత్రపక్షం జేడీయూకు ఇతర పార్టీల నుంచి ఎక్కువ మద్దతు వస్తుందని భావించి, మిత్రపక్షానికి కేటాయించింది.

JD(U) MP to be NDA candidate for RS deputy chairman post: Nitish calls KCR

జేడీయూ రాజ్యసభ సభ్యుడు హరివంశ్ నారాయణ సింగ్ ఎన్డీయే తరఫున రాజ్యసభ చైర్మన్ బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే తరఫున పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థికి మద్దతు కూడగట్టేందుకు నితీష్ పలువురికి ఫోన్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్‌కు ఫోన్ చేశారు. మంగళవారం సాయంత్రం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ పదవీకాలం ముగిసింది. దీంతో జూలై 1 నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. కాంగ్రెస్, టీఎంకీలు కూడా ఈ పదవిని కోరుకుంటున్నాయి. విపక్షాల నుంచి ఎన్డీయేకు గట్టి పోటీ ఉంది. అయితే జేడీయూ నేత నితీష్ మద్దతు కూడగట్టగలరని ఎన్డీయే పార్టీలు భావిస్తున్నాయి.

Recommended Video

కవిత తప్ప ఎవరూ కనిపించలేదా: ఆకుల విజయ

రాజ్యసభలో 245లకు గాను 125 ఓట్లు తమకు వస్తాయని ఎన్డీయే భావిస్తోంది. అన్నాడీఎంకే, టీఆర్ఎస్, బీజేడీ, వైయస్సార్ కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా మద్దతు తెలుపుతాయని భావిస్తున్నారు. లేదా ఇందులోని కొన్ని పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉండటం వల్ల తమ అభ్యర్థి గెలుపు ఖాయమని చెబుతున్నారు. రాజ్యసభలో ఎన్డీయేకు 92 మంది సభ్యుల మద్దతు ఉంది.

English summary
Sensing an advantage in the numbers game, the NDAdecided to field first-time JD(U) MP Harivansh for the post of Rajya Sabha deputy chairman, a decision intended to be a signal that the alliance in Bihar is firm, besides being an acknowledgement of the strength in the Upper House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X