వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేఈఈ అడ్వాన్స్‌డ్ తెలుగు విద్యార్థులు సత్తా: టాపర్స్ వీరే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు. జాతీయస్థాయిలో తొలి 10 ర్యాంకుల్లో ఐదుగురు తెలుగు రాష్ట్రాల విద్యార్థులే కావడం విశేషం. అంతేగాక, తొలి వంద ర్యాంకుల్లో 20కిపైగా ఏపీ, తెలంగాణ విద్యార్థులకే దక్కాయి.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన అమన్‌ బన్సాల్‌ ప్రథమ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. యమునానగర్‌కు చెందిన భవేశ్‌ ధింగ్రా రెండో ర్యాంకు దక్కించుకోగా, జైపూర్‌కు చెందిన కునాల్‌ గోయల్‌కు మూడో ర్యాంకు దక్కింది.

బాలికల్లో రాజస్థాన్‌లోని కోటకు చెందిన రియా సింగ్‌ మొదటి స్థానంలో నిలిచింది. విజయవాడకు చెందిన దుగ్గాని జీవితేశ్‌ 372 మార్కులకు గాను 300 మార్కులు సాధించి ఓబీసీ కేటగిరీలో మొదటి ర్యాంకు, ఓపెన్‌ కేటగిరీలో 4వ ర్యాంకు సాధించాడు.

JEE Advanced-2016: 29 Telugu students into top-100 rankers’ list

ఎస్టీ విభాగంలో చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన ముదె చైతన్య నాయక్‌ అగ్రస్థానంలో నిలిచాడు. దివ్యాంగుల కేటగిరీలో గుంటూరుకు చెందిన కల్లూరి హరిప్రసాద్‌ మొదటి ర్యాంకు సాధించగా అనంతపురానికి చెందిన వినీత్‌ కృష్ణ ఎస్టీ దివ్యాంగ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచాడు.

ఐఐటీల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు 1,55,948 మంది దరఖాస్తు చేసుకున్నారు. మే 22న జరిగిన పరీక్షను 1,47,678 మంది రాశారు. ఈ పరీక్ష నిర్వహించిన ఐఐటీ గౌహతి.. జనరల్‌ విభాగానికి అర్హత మార్కులను 75గా నిర్ణయించింది.

75, ఆపైన వచ్చిన వారికి ర్యాంకులు ఇచ్చారు. ఓబీసీ విద్యార్థులకు 67, ఎస్సీ, ఎస్టీలకు 38 మార్కులను అర్హతగా నిర్ణయించారు. ఈ మేరకు మొత్తం 36,566 మంది అర్హత సాధించారు. ఇందులో బాలురు 31,996 మంది. బాలికలు 4,570 మంది అర్హత సాధించారు.

అర్హత పొందిన విద్యార్థుల్లో బాలికలు 12 శాతమే కావడం గమనార్హం. ఈ ఫలితాల ఆధారంగా దేశంలోని 23 ఐఐటీలతోపాటు రాజీవ్‌ గాంధీ చమురు సాంకేతిక సంస్థ (ఆర్‌జీపీఐటీ), రాయ్‌బరేలీ చమురు, విద్యుత్తు సంస్థ (ఐఐపీఈ) తదితర ప్రముఖ సంస్థల్లో సీట్లను భర్తీ చేస్తారు.

ఓపెన్ కేటగిరీలో తెలుగు విద్యార్థుల టాప్ ర్యాంకులు

దుగ్గాని జీవితేష్ - 4వ ర్యాంకు
సాయితేజ తాళ్లూరి - 5వ ర్యాంకు
నిఖిల్ సామ్రాట్ - 7వ ర్యాంకు
సాయి ప్రణీత్ రెడ్డి - 8వ ర్యాంకు
విఘ్నేష్ రెడ్డి కొండా - 10వ ర్యాంకు
నర్రా సూరజ్ - 12వ ర్యాంకు
లక్ష్మీనారాయణ - 13వ ర్యాంకు
చుండూరి రాహుల్ - 15వ ర్యాంకు
వంశీ కృష్ణారెడ్డి - 20వ ర్యాంకు
రుక్మాంగద సాయి - 22వ ర్యాంకు
సాత్విక్ రెడ్డి - 25వ ర్యాంకు
రామ మహీధర్ రెడ్డి - 28వ ర్యాంకు
పవన్ భార్గవ్ - 30వ ర్యాంకు
కొత్తపల్లి వినీత్ - 30వ ర్యాంకు

English summary
Students from Telangana state and Andhra Pradesh excelled in JEE Advanced-2016 results that were announced on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X