వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్‌ను ఏపీలో తిడ్తున్నారు: కవితకు టి కాంగ్రెస్ జీవన్‌రెడ్డి(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పుష్కర స్నానం చేస్తే కాంగ్రెస్ పార్టీ పాపాలు పోతాయాని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి చేసిన సూచన పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి శనివారం నాడు కౌంటర్ ఇచ్చారు.

కవిత వ్యాఖ్యలు ఖండిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ చేసిన పాపమా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు రాహుల్ గాంధీ బాధ్యుడని ఏపీ ప్రజలు విమర్శిస్తుంటే, కవిత మాత్రం అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు.

తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ నివాసానికి కుటుంబసమేతంగా వెళ్లినప్పుడు తాము పాపం చేసినట్లు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కారుకు దగ్గక కావాలనే ప్రయత్నంలో కవిత తమ యువనేత రాహుల్ గాంధీ పైన విమర్శలు చేశారన్నారు.

జీవన్ రెడ్డి

జీవన్ రెడ్డి

తెలంగాణలో వెయ్యిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ పాపం టిఆర్ఎస్‌దే అన్నారు. సదరు రైతులకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అడ్వోకేట్ జేఏసీ

అడ్వోకేట్ జేఏసీ

ప్రత్యేక హైకోర్టుతోపాటు విభజన చట్టం హామీల అమలు డిమాండ్‌తో సంపూర్ణ తెలంగాణకోసం ఆగస్టు 6వ తేదీ నుంచి మరో ఉద్యమం చేపడుతామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు.

 అడ్వోకేట్ జేఏసీ

అడ్వోకేట్ జేఏసీ

తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు - ఆవశ్యకత అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

 అడ్వోకేట్ జేఏసీ

అడ్వోకేట్ జేఏసీ

కేంద్రం విధానాలు తెలంగాణకు అన్యాయం చేసేవిగా ఉన్నాయని, విద్యుత్ ఉద్యోగుల కేటాయింపు విషయంలో రాష్ర్టానికి కేంద్రం లేఖ రాయడాన్ని ఉదహరించారు.

 అడ్వోకేట్ జేఏసీ

అడ్వోకేట్ జేఏసీ

ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ఆస్తుల విభజనలో అనవసర తాత్సారం జరుగుతుందన్నారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయడానికి చట్టానికి సవరణలు అక్కరలేదని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్కొన్నారు.

అడ్వోకేట్ జేఏసీ

అడ్వోకేట్ జేఏసీ

ఏపీ, తెలంగాణ మధ్య శాసననిర్వాహక, కార్వనిర్వాహక వ్యవస్థలను రెండుగా విభజించి, న్యాయవ్యవస్థను ఉమ్మడిగా ఉంచడంతో పునర్‌వ్యవస్థీకరణ చట్టం అమలు అసంపూర్ణంగా మిగిలిందన్నారు.

English summary
Congress Senior leader and MLA Jeevan reddy slams Nizamabad MP Kavitha
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X