వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌ చెప్పేవన్నీ మాయమాటలు, అబద్దాలే: జీవన్ రెడ్డి, శ్రీధర్ ఫైర్

మాయ మాటలతో ప్రజలను మభ్యపెడుతూ... మోసం చేస్తూ సీఎం కేసీఆర్‌ ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: మాయ మాటలతో ప్రజలను మభ్యపెడుతూ... మోసం చేస్తూ సీఎం కేసీఆర్‌ ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీఎల్‌పీ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లబ్యారేజీ, కన్నెపల్లి, గోళవాడ, సిరిపురం, పంపు హౌస్‌ బాధిత రైతులకు 2013 కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ సర్కార్‌పై ఒత్తిడి పెంచేందుకు పీసీసీ ఉపాధ్యకక్షుడు, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో మంథని నియోజకవర్గం పరిధిలోని జయశంకర్‌ జిల్లా మహదేవ్‌వపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ముందు మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ చేప్టిన నిరసన దీక్షలో జీవన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Jeevan Reddy and Sridhar Babu fires at KCR

అంతకుముందు కాంగ్రెస్‌ శ్రేణులు భారీ స్వాగతాల మధ్య ముందుగా జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు కొమురంభీమ్‌, శ్రీపాదరావు విగ్రహాలకు పూల మాలలువేసి నివాళులర్పించారు. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు కింద వేలాది ఎకరాల భూములు ముంపుకు గురవుతాయని తెలిసినా.. ప్రాజెక్టు అసలు నివేదికలను బయటపెట్టకుండా సీఎం కేసీఆర్‌, టిఆర్‌ఎస్‌ పాలకులు, నాయకులు వంద, రెండు వందల ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

జీఓ 123 కాకుండా 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని, అప్పుడే రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందుతుందన్నారు. మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షుడు శ్రీధర్‌బాబు మ్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతుల నుంచి బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, గోమాస శ్రీనివాస్‌, కాంగ్రెస్‌, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

English summary
Congress leaders Jeevan Reddy and Sridhar Babu fired at Telangana CM K Chandrasekhar Rao for Kaleshwaram project issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X