వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ జగన్‌ను చూసి నేర్చుకో .. జీవన్‌రెడ్డి హితవు

|
Google Oneindia TeluguNews

పెద్దపల్లి : సీఎం కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అర్థబలంతో వీర్రవీగుతున్నారని .. విపక్ష
పార్టీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కొవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

విపక్షం వద్దా ..

విపక్షం వద్దా ..

ఏ రాష్ట్రంలోనైనా విపక్షం ఉండాలి .. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపాలన్నారు జీవన్ రెడ్డి. కానీ కేసీఆర్ మాత్రం ప్రతిపక్షం లేకుండా చేయాలని చూడటం సరికాదన్నారు. సభలో గొంతెత్తి అరిచేవారు లేకుండే సమస్యలు సభ దృష్టికి ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలను నయానో, భయానో బెదిరించి, పార్టీలో చేర్చుకోవడం సరికాదన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీని నేతలు వీడిన సందర్భంగా ప్రలోభాలపై గొంతెత్తిన కేసీఆర్ .. ఇప్పుడు ఆయన చేస్తుందేంటీ అని ప్రశ్నించారు.

జగన్ బెటర్ ...

జగన్ బెటర్ ...

ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిని చూసి కేసీఆర్ నేర్చుకోవాలన్నారు జీవన్ రెడ్డి. తనకన్నా చిన్నవాడైనా జగన్ ఎంతో రాజకీయ పరిణతి ప్రదర్శిస్తున్నారని కొనియాడారు. తమ పార్టీలోకి రావాలంటే ముందు పార్టీ సభ్యత్వానికి, పదవీకి రాజీనామా చేసి చేరాలని జగన్ చెప్పడం హర్షణీయమని ప్రశంసించారు. ఏపీ సీఎం చెప్పిన విధంగా మీరు ఎందుకు చేయడం లేదని నిలదీశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయదగ్గ మెజార్టీ ఉన్నప్పుడు విపక్ష సభ్యులను పార్టీలో చేర్చుకోవడం ఎందుకు అని మండిపడ్డారు. ఇది ప్రజాప్రతినిధ్య చట్టం ఉల్లంఘన కిందకు వస్తోందని నొక్కి వక్కానించారు. దీంతోపాటు ఏపీలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసే సాహసోపేతమైన నిర్ణయం జగన్ తీసుకున్నారని పేర్కొన్నారు. అదే ధైర్యం మీరు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కారెక్కారు ..

కారెక్కారు ..

కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేల టీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు పార్టీ వీడటంతో సీఎల్పీ కూడా టీఆర్ఎస్ఎల్పీలో విలీనమైందని .. స్పీకర్ గెజిట్ కూడా విడుదల చేశారు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ న్యాయపరంగా పోరాటం చేస్తోంది. ఇప్పటికే హైకోర్టులో ఆ పార్టీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి.

English summary
It is not right to see KCR to do it without opposition. jeevan reddy asked, "How will the problems that come out of the House come to the attention of the House?" In the past, the TRS party leaders are keen on the temptations of KCR who is now questioning him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X