హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెట్ ఎయిర్ వేస్‌కు తప్పిన ముప్పు, ఊపిరి పీల్చుకున్న 136 మంది ప్రయాణీకులు

బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్తున్న జెట్ ఎయిర్ వేస్ విమాన సర్వీసుకు శనివారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్తున్న జెట్ ఎయిర్ వేస్ విమాన సర్వీసుకు శనివారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో అది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.

సిబ్బంది సహా 147మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ విమానం సాంకేతిక లోపం కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం రాత్రి అత్యవసరంగా దిగింది. హైడ్రాలిక్‌లో తలెత్తిన లోపాన్ని పైలట్ గుర్తించాడు.

Jet Airways

విమానాన్ని సురక్షితంగా దించాడు. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు గంటన్నరసేపు విమానం రన్‌వేపైనే నిలిచిపోయింది. దీంతో విమానాశ్రయానికి రావాల్సిన నాలుగు విమానాలను దారి మళ్లించారు.

బెంగళూరు విమానాశ్రయం నుంచి కోల్‌కతా వెళ్లేందుకు జెట్ ఎయిర్ వేస్ విమానం షెడ్యూల్ ప్రకారం రాత్రి బయలుదేరింది. విమాన సర్వీసులో హైడ్రాలిక్ లోపం తలెత్తడంతో పైలట్ విషయాన్ని చెప్పారు. ఏటీసీ అధికారులను అనుమతి కోరారు. అధికారుల సూచనలతో దించారు.

English summary
Jet Airways plane makes emergency landing at Hyderabad; passengers, crew safe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X