హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ప్రభుత్వాన్ని ఏకిపారేసిన గుజరాత్ యువ సంచలనం!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

తెలంగాణ ప్రభుత్వాన్ని ఏకిపారేసిన.. గుజరాత్ యువ సంచలనం !

హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగని పరామర్శించడానికి బుధవారం హైదరాబాద్ వచ్చిన జిగ్నేష్ మేవానీ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడడం సంచలనంగా మారింది.

అనుమతి లేకుండా నిరసనకు దిగిన కేసులో ఎమ్మర్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగని హైదరాబాద్ పోలీసులు నిర్బంధించడం, అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించడం తెలిసిందే.

Jignesh Mevani slams Telangana Government!

బుధవారం జైల్లో ఉన్న మందకృష్ణను కలసిన జిగ్నేష్ సంఘీభావం వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పోలీసు రాజ్యాన్ని నడిపిస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన తీవ్ర స్థాయికి చేరుకుందని ఆయన ఆరోపించారు.

గుజరాత్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యువత్రయం హార్థిక్ పటేల్, జిగ్నేష్ మేవానీ, అల్పేష్ ఠాకూర్ ప్రధాని మోడీకే ముచ్చెమటలు పట్టించిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు యువనాయకులు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు.

జిగ్నేష్ మేవానీ గుజరాత్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే గా విజయం సాధించి ప్రస్తుతం దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్ గా మారాడు. దళిత నేత మంద కృష్ణ మాదిగని పరామర్శించడానికి బుధవారం హైదరాబాద్ వచ్చిన జిగ్నేష్ దళితుల పట్ల తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశాడు.

నాయకుడిని నిర్బంధిస్తే ఉద్యమం మరింతగా ఎగసి పడుతుందని జిగ్నేష్ మేవానీ హెచ్చరించారు. తెలంగాణలో దళిత సంఘాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం దళితులకు ఐదెకరాల భూమిని కేటాయించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. బుధవారం మందకృష్ణను కలిసిన వారి జాబితాలో సినీ విమర్శకుడు కత్తి మహేష్ కూడా ఉండడం గమనార్హం.

English summary
Jignesh Mevani, the independent MLA of Gujarat, met Manda krishna Madiga at the Chanchalguda Jail who had been kept under remand. After speaking for some time in the jail with Mandakrishna Madiga, Jignesh came out and spole with the press. He said that putting Mandakrishna Madiga in jail who has been fighting for the rights of the downtrodden is against democracy. He said that he came to Hyderabad to meet Mandakrishna Madiga after his soul led him here. He said that the center should categorize SC very early, otherwise all the SCs in the country would revolt. He also said that there is police rule in Telangana and that human rights violation is highest in the state. Jignesh also said that the government is not caring the backward caste and that it should provide 5 acres of land to all backward people. Kathi Mahesh is also another person in the list of people who met Manda Krishna Madiga on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X