వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు నిధులివ్వకుంటే ప్రజలే బుద్దిచెబుతారు: బిజెపిపై టిఆర్ఎస్ నిప్పులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బిజెపి ప్రభుత్వం తీరు తెలంగాణ ప్రజలకు అర్ధమైందని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు జితేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.బిజెపి ప్రభుత్వం తెలంగాణకు ఏం చేయదని తేట తెల్లమైందని జితేందర్ రెడ్డి చెప్పారు.

ఆదివారం సాయంత్రం ఢిల్లీలో ప్రభుత్వం నిర్వహించిన అఖిలపపక్ష సమావేశం తర్వాత టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు జితేందర్ రెడ్డి మాట్లాడారు.మూడున్నరేళ్లుగా కేంద్రం హామీలతోనే సరిపెడుతోంది తప్ప చేతల్లో చూపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Jitender made allegations on bjp government

ఇక హామీలకు ఎంతమాత్రమూ శాంతించబోమని జితేందర్ రెడ్డి చెప్పారు. కేంద్రం నుంచి తెలంగాణకు రూ.5 వేల కోట్ల బకాయిలు రావాలని
జితేందర్ రెడ్డి గుర్తు చేశారు.

ఈ బడ్జెట్‌లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని జితేందర్ రెడ్డి హెచ్చరించారు. హైకోర్టు, బయ్యారం, స్టీల్‌ప్లాంట్, హార్టికల్చర్ వర్సిటీ, ఎయిమ్స్ నిధులపై ఈ బడ్జెట్ ప్రకటన వస్తుందని జితేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary
Trs parliamentary party leader Jitender made allegations on bjp government on sunday at Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X