వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రముఖ సాహితీవేత్త సి నారాయణ రెడ్డి కన్నుమూత, సినారె ప్రస్థానం

ప్రముఖ సాహితీవేత్త, కవి, రచయిత, జ్ఞాతపీఠ్ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి(సినారె) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో సోమవారం ఉదయం మృతి చెందారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త, కవి, రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి(సినారె) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో సోమవారం ఉదయం మృతి చెందారు. సినారెకు భార్య సుశీల, నలుగురు కుమార్తెలు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి ఉన్నారు.

జననం.. విద్యాభ్యాసం

జననం.. విద్యాభ్యాసం

కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో మల్లారెడ్డి,బుచ్చమ్మ దంపతులకు జులై 29, 1931లో సి నారాయణ రెడ్డి జన్మించారు. తండ్రి మల్లారెడ్డి రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. బాల్యంలో హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడయ్యాడు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించాడు. అప్పట్లో తెలుగు ఒక ఐచ్ఛికాంశాంగానే ఉండేది. హైదరాబాదులోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందారు. విద్యార్థిగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో అనేక గ్రంథాలు చదివారు.

<strong>తెలుగుజాతి రత్నం: ఘనంగా సినారె జన్మదిన వేడుకలు(పిక్చర్స్)</strong>తెలుగుజాతి రత్నం: ఘనంగా సినారె జన్మదిన వేడుకలు(పిక్చర్స్)

ఉద్యోగం.. రచయితగా

ఉద్యోగం.. రచయితగా

సికింద్రాబాద్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి అటు తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయములో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారాలు పొందారు. కాగా, సినారె రాజ్యసభ సభ్యునిగానూ సేవ‌లందించారు. తెలుగు చలన చిత్ర రంగంలో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. మొత్తం 3500 పాటలు రాశారు సినారె.

<strong>సినారెకు సత్కారం: కెసిఆర్ కలబోత</strong>సినారెకు సత్కారం: కెసిఆర్ కలబోత

కవి అయినప్పటికీ..

కవి అయినప్పటికీ..

సినారె ప్రముఖంగా కవి అయినప్పటికీ ఆయ‌న‌ పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శనా గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి ఎన్నో రాశారు. కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవారు. సినారె కవిత తొలిసారి జనశక్తి పత్రికలో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించారు. 1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సి.నా.రె తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి.

<strong>తెలంగాణ ఉద్యమానికి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి. నారాయణ రెడ్డి</strong>తెలంగాణ ఉద్యమానికి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి. నారాయణ రెడ్డి

సినీ గేయ రచయితగా..

సినీ గేయ రచయితగా..

రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. 1962 లో గులేబకావళి కథ చిత్రం లోని నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ అనే పాటతో ప్రారంభించి నేటి వరకు 3500 గీతాలు రచించారు.

<strong>లగడపాటికి ఎదురుదెబ్బ: తెలంగాణకు సినారె సై</strong>లగడపాటికి ఎదురుదెబ్బ: తెలంగాణకు సినారె సై

పలు భాషాల్లో..

పలు భాషాల్లో..

సినారె గ్రంథాలు ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడం మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయనే స్వయంగా హిందీ, ఉర్దూ భాషల్లో కవిత రాశారు. అమెరికా, ఇంగ్లండ్‌, ఫ్రాన్స్, రష్యా, జపాన్, కెనడా, ఇటలీ, డెన్మార్క్, థాయ్లాండ్‌, సింగపూర్, మలేషియా, మారిషస్, యుగోస్లోవియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలను సందర్శించారు. 1990 లో యుగోస్లేవియాలోని స్రూగాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిథిగా పాల్గొన్నారు.

అత్యున్నత పురస్కారాలు

అత్యున్నత పురస్కారాలు

సినారెకు ఆయన రచించిన విశ్వంభరకు గానూ 1988లో భారత సాహిత్యంలో అత్యున్నత పురస్కారం జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. విశ్వనాథ సత్యనారాయణ తర్వాత జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న రెండో తెలుగువారు సినారెనే కావడం గమనార్హం. 1953లో నవమిపువ్వు పేరుతో సినారె తొలి రచన చేశారు. ఆయనకు 1977లోనే పద్మశ్రీ అవార్డు లభించింది.

సత్కారాలు

సత్కారాలు

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ, కేంద్ర సాహిత్య అకాడెమీ, భారతీయా భాషా పరిషత్,
రాజలక్ష్మీ పురస్కారం, సోవియట్-నెహ్రూ పురస్కారం, అసాన్ పురస్కారం లాంటిమొదలైనవి ఆయన్ను వరించాయి. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ గౌరవాలతో సత్కరించింది. ఆంధ్ర, కాకతీయ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మీరట్, నాగార్జున విశ్వ విద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. డా. బోయి భీమన్న జీవన సాఫల్య పురస్కారం - 2 లక్షల నగదు, ప్రసంశపత్రం (బోయి భీమన్న సాహిత్య పీఠం,తెలుగు విశ్వవిద్యాలయం, 19.09.2014)

అనేక పదవులు

అనేక పదవులు

సినారె విద్యాత్మకంగా,పాలనా పరంగా ఎన్నో పదవులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు (1981), అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1985), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1989), ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు (1992)గా చేశారు. రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా ఏడేళ్ళు, భారత రాష్ట్రపతి ఆయన్ను 1997 లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు. ఆరేళ్ళపాటు సభలో ఆయన ప్రశ్నలు, ప్రసంగాలు, చర్చలు, ప్రస్తావనలు అందరి మన్ననలనూ అందుకున్నాయి. 1993 నుంచి అంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా విలక్షణ కార్యక్రమాలు రూపొందించి తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక అభ్యుదయానికి తోడ్పడుతున్నాడు.

ప్రముఖుల సంతాపం

ప్రముఖుల సంతాపం

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్ధించారు. సాహిత్య రంగంలో సీనారే చేసి కృషి ఎప్పటికీ మరిచిపోలేనిదని సీఎం చెప్పారు. అధ్యాపకుడిగా, సాహితీవేత్తగా, కవిగా, సినీ గేయ రచయితగానే కాకుండా రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన సేవలందించారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.
తనకు స్వయంగా గురువు అని, ఆయన స్ఫూర్తితోనే తాను సాహిత్య రంగంలోకి వచ్చినట్లు నందినీ సిద్ధారెడ్డి తెలిపారు. తెలుగు సాహిత్యంలో ఆయన చేసిన కృషి అమోఘమని చెప్పారు. ఆయన లేని లోటు తీర్చలేమని చెప్పారు. తెలుగు భాష సమైక్యత కోసం సినారె ఎనలేని కృషి చేశారని రామజోగయ్య శాస్త్రి అన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు భాషాభివృద్ధి కోసం సినారె కృష్టి చేస్తున్నారే ఉన్నారని చెప్పారు. సినారె లేని లోటును ఎవరూ పూడ్చ లేరని చెప్పారు.

English summary
Jnanpeeth awardee C Narayana Reddy passed away on Monday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X