హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఈ వార్త మీకోసమే: క్లాసులు బంక్ కొట్టారో అంతేసంగతులు

|
Google Oneindia TeluguNews

చిన్నతనంలో పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే మారాం చేసేవారు. వారిని స్కూలుకు పంపాలంటే తల్లిదండ్రుల తల ప్రాణం తోకకు వచ్చేది. ఇక పిల్లలు క్రమంగా పెరుగుతూ స్కూలు నుంచి ఇంటర్మీడియెట్ కాలేజీకి సక్రమంగానే వెళ్లేవారు. ఇక ఒక్కసారి ఇంటర్ కాలేజీ దాటి డిగ్రీ కాలేజీలో అడుగు పెట్టే విద్యార్థులు కాలేజీని ఎగ్గొట్టి ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలకు, షికార్లకు వెళుతున్న సంఘటనలు చాలా చూశాం. ఇలా కాలేజ్ బంక్ కొట్టేవారికి ఓ సరికొత్త విధానం ప్రవేశపెట్టింది హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ.

Recommended Video

3 Minutes 10 Headlines | North-East Delhi | Amaravathi Lands | SSC Exams | Oneindia Telugu
జిల్ జిల్ జిగా లైఫ్‌కు చెక్

జిల్ జిల్ జిగా లైఫ్‌కు చెక్

ఇంజినీరింగ్... ఈ కోర్స్ అంటే విద్యార్థులు తెగ ఎంజాయ్ చేస్తారు. కాలేజీకీ రావడం తక్కువే.. లెక్చర్స్ వినడం తక్కువే అయినప్పటికీ ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అవుతారు. అయితే ఇలా కొంతమంది విద్యార్థులు మాత్రమే ఉంటారు. ఒక్కసారి ఇంజినీరింగ్‌ కోర్సులో అడుగు పెట్టిన విద్యార్థులంతా లైఫ్ జిల్ జిల్ జిగా అనేలా భావిస్తారు. ఇక విద్యార్థులు తరగతులకు హాజరు కావడం లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో హైదరాబాదులోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్‌టీయూ) విద్యార్థుల హాజరు పెంచేందుకు బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టింది.

 బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం

బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం

జేఎన్‌టీయూ హెచ్ పరిధి కిందకు వచ్చే దాదాపు 250 కాలేజీలు ఇకపై బయోమెట్రిక్ అటెండెన్స్ విధానంను ప్రవేశపెట్టనున్నాయి. ఇది ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేయనుంది. మరో రెండు వారాల్లో అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ వ్యవస్థ రానుంది. ఇప్పటికే దీని ప్రక్రియ ప్రారంభమైందని జేఎన్‌టీయూ రెక్టార్ మరియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ చెప్పారు. ఇప్పటి వరకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం టీచింగ్ స్టాఫ్‌కు పోస్టుగ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ విద్యార్థులకు మాత్రమే ఉండేది. ఇక తాజాగా విద్యార్థులకు కూడా ప్రవేశపెట్టడంతో క్లాసులను స్టూడెంట్స్ ఎగ్గొట్టరనే భావన ఉంది. అంతేకాదు క్రమశిక్షణతో కూడా విద్యార్థులు ఉంటారని అదే సమయంలో క్లాసులకు హాజరై పాఠాలను శ్రద్ధగా వింటారని జేఎన్‌టీయూ పాలనావర్గం భావిస్తోంది.

 హైలెవెల్ మీటింగ్‌లో మరిన్ని నిర్ణయాలు

హైలెవెల్ మీటింగ్‌లో మరిన్ని నిర్ణయాలు

జేఎన్‌టీయూలో జరిగిన హైలెవెల్ మీటింగ్‌లో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానంను ప్రవేశపెట్టాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంకు మొత్తం 250 అనుబంధ కాలేజీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. బయోమెట్రిక్ వ్యవస్థతో పాటు విద్యావ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఫ్యాకల్టీ తమ స్కిల్స్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని సూచించారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్ మరియు అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్‌లాంటివి నేర్చుకోవాలని సూచించింది. అంతేకాదు విద్యార్థుల్లో ఎంట్రప్యూనర్షిప్ కల్చర్‌ను అలవర్చాలని సమావేశంలో నిర్ణయించారు. ఇక ఆయా కాలేజీలో విద్యార్థులకు ప్లేస్‌మెంట్ విషయంలో కూడా జేఎన్‌టీయూ సహకరించాలని వైస్ ఛాన్సెలర్ చెప్పారు.

English summary
For the first time, Jawaharlal Nehru Technological University, Hyderabad, (JNTUH) is introducing the biometric attendance system for under-graduate engineering students in a bid to deter them from bunking lectures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X