వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ఫ్యామిలి నుంచి మరొకరు: చెన్నమనేనికి షాక్, టి న్యూస్ సంతోష్‌కు బంపరాఫర్

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికార తెరాస పార్టీ ఘన విజయం సాధిస్తూ వెళ్తోంది. తొలుత మెదక్ ఎంపీగా పోటీ చేసిన కెసీఆర్ రాజీనామా మొదలు కడియం శ్రీహరి రాజీనామా వరకు టిఆర్ఎస్ గెలిచింది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

కెసిఆర్ ఫ్యామిలి నుంచి మరొకరు: చెన్నమనేనికి షాక్, టి న్యూస్ సంతోష్‌కు బంపరాఫర్ | Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికార తెరాస పార్టీ ఘన విజయం సాధిస్తూ వెళ్తోంది. తొలుత మెదక్ ఎంపీగా పోటీ చేసిన కెసీఆర్ రాజీనామా మొదలు కడియం శ్రీహరి రాజీనామా వరకు టిఆర్ఎస్ గెలిచింది.

చదవండి: భారత పౌరుడు కాదు: చెన్నమనేనికి కేంద్రం షాక్, స్పందన, ఏం జరిగింది?

అంతేకాదు, ఖమ్మం జిల్లాలో పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట రెడ్డి మృతి చెందారు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే. కానీ అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గెలిచారు.

చదవండి: సంచలనం: 'టిఆర్ఎస్‌లో అసంతృప్తి, కాంగ్రెస్‌లోకి హరీష్ రావు'

వేములవాడ రూపంలో మరో ఉప ఎన్నిక

వేములవాడ రూపంలో మరో ఉప ఎన్నిక

తెలంగాణలో త్వరలో మరో ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అది వేములవాడ నియోజకవర్గానికి. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేని రమేష్ పౌరసత్వం చెల్లదని, ఆయన పౌరసత్వాన్ని కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో ఉప ఎన్నిక అవకాశముందని అంటున్నారు.

చెన్నమనేనికి షాక్ తగిలే అవకాశాలే ఎక్కువ

చెన్నమనేనికి షాక్ తగిలే అవకాశాలే ఎక్కువ

కేంద్ర హోంశాఖ నిర్ణయంపై తాను అప్పీల్‌కు వెళ్తానని చెన్నమనేని రమేష్ చెప్పారు. కానీ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే పౌరసత్వం రద్దు చేసిన నేపథ్యంలో చెన్నమనేని అప్పీల్‌ను కేంద్రం తోసిపుచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

ఉప ఎన్నిక వస్తే దాదాపు అభ్యర్థి ఖరారైనట్లే

ఉప ఎన్నిక వస్తే దాదాపు అభ్యర్థి ఖరారైనట్లే

వేములవాడ ఉప ఎన్నిక దాదాపు అనివార్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార టిఆర్ఎస్ ఇక్కడి నుంచి పోటీ చేయించే అభ్యర్థిపై దాదాపు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తెరాస తరఫున అభ్యర్థి దాదాపు ఖరారైనట్లే అంటున్నారు.

తెరపైకి జోగినిపల్లి సంతోష్ రావు

తెరపైకి జోగినిపల్లి సంతోష్ రావు

సీఎం కెసిఆర్ ఆంతరంగికుడు, ఆయనకు పిఎగా పని చేసి, ప్రస్తుతం టి న్యూస్ ఛానల్‌కు ఎండిగా ఉన్న జోగినిపల్లి సంతోష్ రావును వేములవాడ నుంచి టిఆర్ఎస్ పోటీ చేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

ఇప్పటి వరకు తెరవెనుక.. కెసిఆర్‌కు వరుసకు కొడుకు

ఇప్పటి వరకు తెరవెనుక.. కెసిఆర్‌కు వరుసకు కొడుకు

కెసిఆర్ ఆంతరంగికుడుగా సంతోష్ రావు ఇప్పటి వరకు తెరవెనుక ఉన్నారు. వేములవాడ ఉప ఎన్నిక వస్తే ఇక ఎన్నికల రంగంలోకి దిగినట్లే అంటున్నారు. కెసిఆర్‌కు వరుసకు కొడుకు అవుతాడు. ఇటీవల ఆయన బయటకు కనిపిస్తున్నారు కూడా.

కెసిఆర్ డైరెక్షన్ మేరకే.. ఇలా రంగ ప్రవేశం

కెసిఆర్ డైరెక్షన్ మేరకే.. ఇలా రంగ ప్రవేశం

సీఎం కెసిఆర్ డైరెక్షన్ మేరకే సంతోష్ రావు తెర మీదకు వస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల సంతోష్ వేములవాడ వెళ్లినప్పుడు హడావుడి కనిపించింది. దీంతో ఆయన ఎమ్మెల్సీగా రాజకీయాల్లోకి వస్తారని భావించారు. కానీ ఇప్పుడు చెన్నమనేని రమేష్‌కు అన్నిదారులు మూసుకుపోతే ఆయన ఎమ్మెల్యేగా రంగ ప్రవేశం చేస్తారని అంటున్నారు.

సంతోష్ హడావుడి

సంతోష్ హడావుడి

ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో సంతోష్ చాలా కీలకంగా వ్యవహరించారు. దీనికి టి న్యూస్ ప్రత్యేకంగా ప్రచారం చేసింది. అంతటా సంతోష్ బొమ్మలతో కూడిన బ్యానర్లు కనిపించాయి. మంత్రి కెటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఆశ్రమానికి రూ.6 లక్షల విరాళం అందించారు.

బలమైన అభ్యర్థి లేకపోవడం ప్లస్

బలమైన అభ్యర్థి లేకపోవడం ప్లస్

సంతోష్ సొంత ఊరు.. వేములవాడ నియోజకవర్గాన్ని ఆనుకొని ఉన్న చొప్పదండి నియోజకవర్గంలో ఉంటుందని తెలుస్తోంది. వేములవాడలో తెరాసకు బలమైన అభ్యర్థి లేకపోవడం సంతోష్‌కు కలిసి వచ్చే అంశమని అంటున్నారు.

చెన్నమనేనికి చిక్కులు.. సంతోష్‌కు బంపరాఫర్

చెన్నమనేనికి చిక్కులు.. సంతోష్‌కు బంపరాఫర్

అంతేకాదు సంతోష్‌ను నిలబెడితే గెలుపు సులువు అని కెసిఆర్ కూడా భావిస్తున్నారని సమాచారం. వేములవాడలో వెలమ సామాజిక వర్గం ఓటు బాగా ఉంది. మొత్తానికి చెన్నమనేనికి వచ్చిన చిక్కులు.. టి న్యూస్ సంతోష్‌కు బంపరాఫర్ తీసుకు వచ్చాయని అంటున్నారు.

English summary
T News MD Joginpally santosh Rao may entry in Politics from Telangana Chief Minister Kalvakuntla Chandrasekhar Rao's Family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X