వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనూ అడవిపందుల బాధితుడినే: మంత్రి జోగు రామన్న(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అడవిపందుల వల్ల నష్టపోయిన బాధితుల్లో తానూ ఒకడినని అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగురామన్న తెలిపారు. అడవిపందులను ఎలా నియంత్రించాలో తెలియక రైతులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో అడవిపందిని చంపిన రైతుకు అటవీశాఖ అధికారులు రూ.50 వేల జరిమానా వేశారని వివరించారు.

అడవిపందిని చంపలేక, పంటలను కాపాడుకోలేక రైతన్నలు అవస్థలు పడుతున్నారని తెలిపారు.
అడవిపందులను కాల్చిచంపాలన్న ఆదేశాలు అసాధారణమైనవేమీ కాదని, రైతులు పంటలను రక్షించుకొనే విధంగా గత ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఆదేశాలను జారీ చేశాయని అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగురామన్న గుర్తు చేశారు.

క్షేత్రస్థాయిలో అడవిపందుల వల్ల తీవ్ర కష్ట, నష్టాలను రైతులు ఎదుర్కొంటున్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆదేశాలివ్వాల్సి వచ్చిందని సోమవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

అడవిపందులను చంపడానికి షరతులు వర్తిస్తాయని అటవీశాఖ అధికారులు పేర్కొనడం తగదని మెదక్ జిల్లా వెలిమల రైతు, అడవిపందుల సమస్యపై పోరాటం జరుపుతున్న పేర్వారం సంతాజీ, వైల్డ్‌లైఫ్ కన్సల్టెంట్లు ఫారూఖీ సోహైల్, రాజీవ్‌మిత్ర అన్నారు. అడవిపందులను చంపే విషయంలో రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని ఆదేశాలివ్వాలని మంత్రి జోగురామన్నను వారు కోరారు.

ఈ మేరకు మంత్రికి సోమవారం సచివాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఎన్నో ఏళ్లుగా రైతులు పడుతున్న కష్టాలను, నష్టాలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం అడవిపందులను కాల్చివేయడానికి ఆదేశాలివ్వడం సంతోషకరమైన పరిణామమని పేర్కొన్నారు. పర్యావరణ చట్టంలోని షెడ్యూల్-4 జాబితా నుంచి అడవి పందిని తొలగించి, ఎలుక మాదిరిగా హానికర జంతువుగా పరిగణించాలని కోరారు.

జోగు రామన్న

జోగు రామన్న

అడవిపందుల వల్ల నష్టపోయిన బాధితుల్లో తానూ ఒకడినని అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగురామన్న తెలిపారు.

జోగు రామన్న

జోగు రామన్న

అడవిపందులను ఎలా నియంత్రించాలో తెలియక రైతులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో అడవిపందిని చంపిన రైతుకు అటవీశాఖ అధికారులు రూ.50 వేల జరిమానా వేశారని వివరించారు.

జోగు రామన్న

జోగు రామన్న

అడవిపందిని చంపలేక, పంటలను కాపాడుకోలేక రైతన్నలు అవస్థలు పడుతున్నారని తెలిపారు.

జోగు రామన్న

జోగు రామన్న

అడవిపందులను కాల్చిచంపాలన్న ఆదేశాలు అసాధారణమైనవేమీ కాదని, రైతులు పంటలను రక్షించుకొనే విధంగా గత ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఆదేశాలను జారీ చేశాయని అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగురామన్న గుర్తు చేశారు.

కాగా, జీవవైవిధ్యాన్ని కాపాడటానికి ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలు తమవంతు సహకారం అందించాలని అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమశాఖల మంత్రి జోగురామన్న అన్నారు. జీవవనరులను ఉపయోగించుకొని ఉత్పత్తులను ప్రారంభించే కంపెనీలు స్థానిక గ్రామపంచాయతీలకు ప్రయోజనాలను పంపిణీ (యాక్సెసరీ బెనిఫిట్ షేరింగ్) చేయాలని సూచించారు.

ఈ విషయంలో రాష్ట్ర జీవవైవిధ్య మండలి పలు కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకుంటుందని సోమవారం సచివాలయంలోని తన చాంబర్‌లో జరిగిన సమావేశంలో ఆయన వెల్లడించారు. ఇప్పటికే జీవవనరులను వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్న కంపెనీలతో కేంద్రస్థాయిలో 23, రాష్ట్రస్థాయిలో 3 యాక్సెసరీ బెనిఫిట్ షేరింగ్ ఒప్పందాలను చేసుకున్నామని చెప్పారు.

తెలంగాణ జీవవైవిధ్య మండలి బయోడైవర్సిటీ యాక్ట్‌పై, జీవవైవిధ్యంపై తెలుగులో ముద్రించిన ఐదు పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో సర్పంచ్ అధ్యక్షతన జీవవైవిధ్య యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1010 కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో జీవవైవిధ్యంలో భాగంగా జీవరాశులు, పంటల రకాల వివరాలతో కూడిన రిజిస్టర్స్‌ను ఏర్పాటు చేసి, అందులో అన్ని వివరాలను పొందుపర్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. బయోడైవర్సిటీ చట్టం ప్రకారం జీవవైవిధ్యానికి హక్కుదారులు ఆయా గ్రామస్థులేనని, వారికి తగిన ప్రతిఫలమివ్వటమే ఈ జీవవైవిధ్య చట్టం ప్రధాన లక్ష్యమని చెప్పారు.

English summary
Telangana Minister Jogu Ramanna responded on wild boar attacks on farms in Telangana districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X