వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అన్నీ అనుకూలిస్తే 2019లో కేసీఆర్ ప్రధాని, కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి'

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస 88 స్థానాల్లో అద్భుత విజయం సాధించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి అధికారం కల్లలు కలలయ్యాయి. తెరాస గెలిచిన వెంటనే కేసీఆర్ మాట్లాడుతూ.. తాను జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తానని తేల్చి చెప్పారు. అంతేకాదు, శుక్రవారం తన కొడుకు, సిరిసిల్ల నుంచి గెలిచిన కేటీ రామారావుకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు.

<strong>అన్నీ చెప్పమంటే ఎలా!: ఏపీలో జగన్ కోసం ప్రచారం చేస్తారా అంటే కేటీఆర్ ఏం చెప్పారంటే?</strong>అన్నీ చెప్పమంటే ఎలా!: ఏపీలో జగన్ కోసం ప్రచారం చేస్తారా అంటే కేటీఆర్ ఏం చెప్పారంటే?

జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని కేసీఆర్

జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని కేసీఆర్

తద్వారా తాను ముఖ్యమంత్రిగా ఉంటూ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారుతానని స్పష్టంగా చెప్పేశారు. ఓ వైపు తెలంగాణలో పాలనపై దృష్టి సారిస్తూ, మరోవైపు ఢిల్లీ రాజకీయాలపై దృష్టి సారించనున్నారు. పార్టీ పగ్గాలను తనయుడికి అప్పగించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ను భావి సీఎంగా పలువురు భావిస్తున్నారు.

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్, హరీష్ రావు అభినందనలు (ఫోటోలు)

కేసీఆర్ ప్రధాని, కేటీఆర్ ముఖ్యమంత్రి

కేసీఆర్ ప్రధాని, కేటీఆర్ ముఖ్యమంత్రి

తాజా మాజీ మంత్రి, అదిలాబాద్ నుంచి గెలిచిన జోగు రామన్న మాట్లాడుతూ.. ప్రజలు ఆశీర్వదిస్తే మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి కావొచ్చునని, కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కావొచ్చునని జోస్యం చెప్పారు. కేటీ రామారావుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు కేసీఆర్‌తోనే సాధ్యమని చెప్పారు.

వచ్చే పార్లమెంటు ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రధాని

వచ్చే పార్లమెంటు ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రధాని

తెరాస అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రధానమంత్రి కావడం పక్కా అని సినీ ప్రముఖులు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి వేరుగా అన్నారు. గుణాత్మకమైన మార్పు దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పారు. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆయన ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.

కేసీఆర్‌కు అభినందన

కేసీఆర్‌కు అభినందన

తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌ను గురువారం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేసన్ ఆధ్వర్యంలో (మా) సెక్రటరీ నరేశ్, హస్యనటుడు అలీ, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తదితరులు కలిశారు. ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. అభినందించారు. అనంతరం కేతిరెడ్డి పైవిధంగా మాట్లాడారు.

English summary
Former Minister and TRS leader Jogu Ramanna says K Chandrasekhar Rao may become PM and KTR CM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X