వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరు విధుల్లో చేరండి... మేము రక్షణ కల్పిస్తాం: రంగంలోకి పోలీసులు

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన కార్మిక వర్గాల్లో ఆలోచనలు రేకిత్తిస్తోంది. సీఎం ప్రకటన ప్రభుత్వానికి సానుకూలంగా మారింది. సమ్మెను విరమించి విధుల్లో చేరాలనుకునే వారికి అయిదు వరకు పొడగించారు. దీంతో కార్మికుల నుండి సానుకూలత వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలోని అక్కడక్కడ కొంతమంది కార్మికులు విధుల్లో చేరారు. కార్మిక నాయకులు పట్టుబడుతున్న ప్రభుత్వ విలీనం ఇక భవిష్యత్‌లో కూడ జరిగే అవకాశం లేదని భావిస్తున్న కార్మికులు మరింత మంది కూడ విధుల్లో చేరేందుకు సిద్దమవుతున్నారు.

అయితే ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో ఆయా జిల్లాల్లో కార్మికులు విధుల్లో చేరుతున్నారు. అయితే కార్మికులు ఒంటరి నిర్ణయం తీసుకోవడంతో కార్మిక సంఘాల నుండి ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. సమ్మెను విచ్చిన్నం చేసేందుకు కార్మికులు కుట్రపన్నుతున్నారనే నెపంతో వారిపై మూకుమ్మడి దాడులు చేసే అవకాశాలు కూడ ఉంటాయి.

join the duties, We provide protection : hyderabad police

కాగా ఇప్పటికే ప్రైవేట్ బస్సులు నడుపుతున్న డ్రైవర్లపై పలు సంధర్భాల్లో ఆర్టీసీ కార్మీకులు దాడులు చేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. డిపోల్లో నుండి బస్సులు రాకుండా మెజారీటి కార్మికులు అడ్డుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి.

ముఖ్యంగా హైదారాబాద్ నగర ప్రజలు బస్సులు లేక నానా అవస్థలు పడుతున్నారు. మొత్తం 40 శాతం మేర మాత్రమే బస్సులు నడుపుతున్నట్టు అధికారలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం హైదారాబాద్‌పై ఫోకస్ పెట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ పిలుపుతో విధుల్లోకి చేరనున్న కార్మికులకు పూర్తి భద్రత కల్పిస్తామని భరోసా కల్పిస్తామని రాచకొండ సీపీ మహెశ్‌భగవత్, తోపాటు హైదరాబాద్ సీపీ సజ్జనార్‌లు ప్రకటించారు.. విధులకు ఆటంకం కల్గిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు. ఈమేరకు కార్మికులను బెదిరించిన వారు ఆయా పోలీస్‌స్టేషన్లలో కేసులు పెట్టాలని కోరారు. ప్రతి డిపో వద్ద పూర్తి భద్రత కల్పిస్తామని పోలీసు అధికారులు ప్రకటించారు.

English summary
The police have announced that they will protect when striking RTC workers join duty. that criminal cases would be filed against those who obstructed the duties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X