వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్నలిస్ట్ అనంచిన్ని వెంకటేశ్వరరావు స్టేషన్ బెయిల్‌పై విడుదల..

|
Google Oneindia TeluguNews

ఉత్కంఠకు తెరపడింది. ప్రముఖ జర్నలిస్ట్ చిన్ని వెంకటేశ్వరరావు సోమవారం రాత్రి విడుదలయ్యారు. ఉదయం ఖమ్మంలో మార్నింగ్ వాక్‌కి బయల్దేరిన ఆయన ఎంతకీ తిరగిరాలేదు. దీంతో కిడ్నాప్ అయ్యారని అనుకొన్నారు. కానీ ఇటీవల ఓ కథనంపై ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది. దీంతో జర్నలిస్టు నేతలు జూబ్లీహిల్స్ స్టేషన్ చేరుకోవడం, ఇతరులు మద్దతు ఇవ్వడంతో అనంచిన్ని రాత్రి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.

మిస్సింగ్..

మిస్సింగ్..

ఉదయం మార్నింగ్ వాక్‌కి వెళ్లిన ఆయన ఫోన్ స్విచ్చాఫ్ అయ్యింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంకటేశ్వరరావు ఆచూకీ కోసం ఆరా తీశారు. ఉదయం 11 గంటల వరకు సమాచారం లభించలేదు. వెంకటేశ్వరరావు ఏమయ్యారు? అనే ఉత్కంఠ నెలకొంది. కిడ్నాప్‌నకు గురయ్యారని తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారు. అదే జరిగితే ఊరుకోబోం అని ప్రకటనలు కూడా వచ్చాయి.

సంజయ్ రియాక్షన్

సంజయ్ రియాక్షన్

ఘటనపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాలని టీజేఎస్ఎస్ ప్రణాళిక ప్రకటించింది. అయితే మధ్యాహ్నం తరువాత వెంకటేశ్వర రావు పై కేసు నమోదు చేసినట్లు సమాచారం వచ్చింది. ఆదాబ్ హైదరాబాద్ దిన పత్రికలో సీఎం కేసీఆర్ కు కరోనా అనే వార్త ప్రచురించినందుకు వెంకటేశ్వరరావు తదితరులను అదుపులోకి తీసుకున్నట్లు చివరకు పోలీసులు చెప్పాల్సి వచ్చింది.

Recommended Video

Coronavirus కారణంగా సీనియర్ Journalist మృతి ! || Oneindia Telugu
రాత్రి 9.30 గంటలకు

రాత్రి 9.30 గంటలకు


ఇక అప్పటినుంచి రాత్రి 9:30 వరకు వెంకటేశ్వరరావును విడుదల చేస్తారా? లేక రిమాండ్ కు తరలిస్తారా అనే అంశం పై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న స్పందనను గమనించిన పోలీసులు చివరికి విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. చివరికి స్టేషన్ బెయిల్ మంజూరు చేసినట్లు ప్రకటించారు. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో జూబ్లీహిల్స్ స్టేషన్ నుండి వెంకటేశ్వరరావు బయటికి వచ్చారు.

English summary
journalist anamchinni venkateshwar rao release to jubilee hills police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X